మహా హోం మంత్రి రాజీనామా

 


మాహారాష్ట్ర లో కుదిపేసిన ముడుపుల వసూలు ఆరోపణలతో చివరికి ఎన్సీపి పార్టీకి చెందిన  హోం మంత్రి  అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదివికి రాజీనామా చేసారు. తన రాజీ నామా లేఖను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ను  కల్సి స్వయంగా అంద చేసారు. తనపై ఆరోపణలు వచ్చిన నేపద్యంలో పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదని అన్నారు. 

దేశ ప్రముఖ పారిశ్రామక వేత్త ముఖేష్ అంబాని ఇంటి సమీపంలో లభించిన పేలుడు పదార్థాల కేసు  మొదలు మహారాష్ట్రలో  అనేకపరిణామాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ర్ట పోలీసు శాఖను  కుదిపి వేసిన ఈ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి హోం మంత్రి రాజీమాకు దారి తీసింది. పేలుడు పదార్థాల వాహనం లభించిన అనంతరం ముంబై ఎన్ కౌంటర్ల స్పెషలిస్టు  సచిన్ వాజేను పోలీసులు అరెస్టు చేశారు. వాజేకు ప్రతి నెల100 కోట్లు వసూలు చేయాలని హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ టార్గెట్ విధించారని మాజి పోలీస్ కమీషనర్ గా పని చేసిన పరమ్‌ బీర్‌ సింగ్‌ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. 

పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై  ప్రాథమిక విచారణ జరపాలని ముంబై హై కోర్టు సిబిఐ ని ఆదేశించింది. అంతే కాకుండా 15 రోజుల్లో  ప్రాథ‌మిక‌ విచార‌ణ పూర్తి చేయాల‌ని, ఆధారాలు ల‌భ్య‌మైతే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. 

దాంతో హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ పై వత్తిడి పెరిగింది. రాజీనామా లేఖకు ముందు ఎన్సీపి అధిేత శరద్ పవార్ తో అనిల్ దేశ్ ముఖ్ సంప్రదింపులు జరిపారు. ఎన్సీపి అధినేత అంగీకారంతోనే రాజినామా లేఖ ఇచ్చారు. త‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు కోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో ప‌ద‌విలో కొన‌సాగ‌డం నైతికంగా స‌రికాద‌ని  అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

"హైకోర్టు నుంచి సీబీఐ విచార‌ణ‌కు ఆదేశాలు వ‌చ్చిన అనంత‌రం మా పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు పార్టీలోని ప‌లువురు నేత‌ల‌ను అనిల్ దేశ్ ముఖ్ క‌లిశారు. విచార‌ణ నేప‌థ్యంలో హోంమంత్రి ప‌ద‌విలో కొన‌సాగ‌బోన‌ని చెప్పారు. అనంత‌రం సీఎంను క‌లిసి, రాజీనామా లేఖ ఇవ్వ‌డానికి వెళ్లారు. ఆయ‌న రాజీనామాను ఆమోదించాల‌ని మా పార్టీ కూడా సీఎంను కోరింది" అని ఎన్సీపి పార్టీకి చెందిన మంత్రి న‌వాబ్ మాలిక్ మీడియా సమేవేశంలో క్లారిటి ఇచ్చారు.

సుప్రీం కోర్టుకు వెళ్లనున్న అనిల్ దేశ్ ముఖ్

సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు ఉత్తర్వులు నిలిపి వేయాలని అనిల్ దేశ్ ముఖ్ సుప్రీం కోర్టుకు వెళ్ల నున్నట్లు ఎన్సీపి పార్టి వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా పార్టి వర్గాలు ధృవీకరించ లేదు. అనిల్ దేశ్ ముఖ్ కు మద్దతుగా మహారాష్ట ప్రభుత్వం కూడ సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు