నిరుద్యోగుల ఛలో నాగార్జున సాగర్ పిలుపు

సాగర్ లో అధికార టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరుద్యోగుల ప్రచారం
కెయు విద్యార్థి సునీల్ నాయక్ బలవన్మరణంపై కదిలిన నిరుద్యోగులు


నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ బలవన్మరణంతో ఉస్మానియా, కాకతీయ, నిరుద్యోగ జేఏసి సంఘాలు మండిపడ్డాయి. 

ఉప ఎన్నికలు జరుగుతున్న నాగార్జున సాగర్ ఎన్నికలప్రచారంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయాలని  జేఏసి సంఘాలు  నిర్ణయించాయి.  ఈ మేరకు నిరుద్యోగు లందరు నాగార్జున సాగర్ కు తరలి రావాలని  జేఏసి సంఘాలు పిలుపు నిచ్చాయి. ఉద్యోగాలు రావడం లేదని బలవన్మరణానికి పాల్పడిన బోడ సునీల్ నాయక్ ఆశయ సాదన కోసం పోరాటం కొనసాగించాలని జేఏసి పిలుపు నిచ్చింది. 

నిరుద్యోగులకు సిఎం కెసిఆర్ చేసిన మేసంపై ఎన్నికల ప్రచారంలో జేఏసి సంఘాలు సాగర్ ఓటర్లకు వివరించాలని నిర్ణించాయి.

రాష్ట్రంలో ల్కష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వేతన సవరణ సంఘం పేర్కొందని అసెంబ్లీ సాక్షిగా 50 వేల ఉద్యోగాలు భర్తి చేస్తామని నిరుద్యోగాలకు ఉద్యోగ భృతి ఇస్తామని  ప్రకటించిన సికెసిఆర్ ఎమ్మెల్సి ఎన్నికల్లో నిరుద్యోగులు తమ పార్టి అభ్యర్థులకు ఓట్లేయలేదని  ఉద్యోగాల భర్తీపై మాటెత్తడం లేదని జేఏసి సంఘాలు విమర్శించాయి. గతంలో  నిరుద్యోగ భృతి కోసం 1810 కోట్లు ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ లో కేటాయించి ఒక్క పైసా కూడ ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేశాడని అన్నారు. రాష్ర్టంలో కేవలం 22 వేల ప్రభుత్వ ఉద్యోగుల కోసం 25 ల్కషల ఉద్యోగుల పొట్ట గొడుతూ ఉద్యోగాలు పదవి విరమణ వయస్సు 61 సంవస్తరాలకు పెంచాడని  జేఏసిసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. 

సిఎం కెసిఆర్ నిర్ణయం వల్లే  నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడ్డారని సంఘాలు పేర్కొన్నాయి. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడేళ్ల కాలంలో 150 మంది వరకు బలవన్మరణాలకు పాల్పడ్డారని పిహెడ్ డి పట్ాట పొందిన నర్సయ్య మాదిగ నోటిఫికేషన్లు రావటం లేదని  మనస్థాపంతో గత ఏడాది కెసిఆర్ జన్మ దినం రోజు ఓయూలో ఆత్మహత్య చేసుకున్నాడని సంఘాలు తెలిపాయి.  గగులోతు రవినాయక్  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కాకతీయ యూనివర్శిటీలో నూనావత్ రవినాయక్ మానసిక క్షోభతో బలవన్మరణానికి పాల్పడ్డాడని మార్చి 26 న బోడ సునీల్ నాయక్ పురుగుల మందు తాగి వీడియో కాల్ లో లైవ్ చూపిస్తూ తన చావుకు కెసిఆరే కారణమని బతికితే పోరాడుతానంటూ లేదంటే కెసిఆర్ను ఎవరు వదలవద్దని చివరి మాటలు చెప్పి పురుగుల మందు తాగి ఏప్రిల్ 2 న చనిపోయాడని జేఏసి సంఘాలు తెలిపాయి. నిరుద్యోగుల బలవన్మరణాలన్ని కెసిఆర్ హత్యలేనని జేఏసి సంఘాలు ఆరోపించాయి.

ఇంత ంది చనిపోతున్నా కెసిఆర్ కు చీమ కుట్టినట్లు కూడ లేదని  కెసిఆర్ అహం తగ్గాలంటే నాగార్జున సాగర్ లో ఓడించి షాక్ ఇవ్వాలని జేఏసి సంఘాలు పిలుపు నిచ్చాయి. సాగర్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఎవరూ ఓటేయవద్దని టిఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు