పాపం ధర్మారెడ్డి మళ్ల నోరు జారిండు..ఈ సారి సిఎం కెసిఆర్ నే

 ఆయన టంగుకు పవర్ ఎక్కువఅధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ఏ ఖయాల్ లో మాట్లాడారో కాని మరోసారి నోరు జారాడు. ఈ సారి స్వయంగా తన బాస్ సిఎం కెసిఆర్ పైనే నేరుగా విమర్శలు చేశాడు. 

నియోజక వర్గం పరిధి లోని నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో  మీడియాతో మాట్లాడిన ధర్మారెడ్డి రైతుల సమస్యలపై మాట్లాడుతూ కెసిఆర్ పై విమర్శలు చేశాడు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పారు.  రైతులు  ఆందోళన చేస్తున్నా పుణ్యాత్ములు నరేంద్ర మోది, కెసిఆర్ పట్టించు కోవడం లేదంటూ విమర్శలు చేశారు. 

ధర్మారెడ్డి మాట్లాడిన మాటలను మీడియా యధా తదంగా రికార్డు చేసి జెండాకెక్కించింది పాపం. సోషల్ మీడియాతో పాటు కొన్ని ప్రధాన మెయిన్ స్ట్రీమ్ లో కూడ ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. 

ఆయన మాట్లాడిన తీరు బట్టి చూస్తే ఇంకా ఆయన తెలుగు దేశం పార్టీలో ఉన్నట్లు భ్రమ పడి ఉంటారు. 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టి నుండి గెలిచిన ధర్మారెడ్డి ఆ తర్వాత టిఆర్ఎస్ "ఆకర్ష్" పథకంలో బాగంగా  ఆ పార్టీలో ఆకర్షితుడై  కెసిఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నాడు. 2018 ఎన్నికల్లో రెండో సారి టిఆర్ఎస్ నుండి గెలిచాడు.  అయినా పాపం ఆయన ఇంకా ఏ ఖయాల్ లో ఉన్నాడో కాని నరేంద్ర మోదీని విమర్శించి అదే వరుసలో కెసిఆర్ పేరు కూడ ఎత్తుకున్నాడు.

ఏదో పొరపాటు దొర్లిందని మీడియాకు వివరణ ఇచ్చినా అప్పటికే మీడియా చేయాల్సిందంతా చేసింది.

కొద్ది రోజుల క్రితం  ధర్మారెడ్డి  రెడ్లు, వెలమలతో జరిగిన బహిరంగ సభలో ఎస్సి ఉద్యోగుల నుద్దేశించి విమర్శలు చేసి బుక్ అయ్యాడు.దళిత, గిరిజన, బి.సి సంఘాలు ఆయన పై దాదాపు యుద్ధం ప్రకటించాయి. మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసాయి. కోర్టు ఆదేశంతో ధర్మారెడ్డిపై  ఎస్సి, ఎస్టి అట్రాసిటీస్ కేసు కూడ నమోదు అయింది. అయినా  ఇంకా ఆయన టంగ్ కు పవర్ తగ్గలేదు. దాని పని అది యధేచ్చంగా కానిస్తోంది.

గతంలో బిజెపి పార్టీ పై రామ మందిర విరాళల సేకరణ విషయంలో  టంగు స్లిప్ అయి అగ్రహానికి గురయ్యాడు. బిజెపి శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేసాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు