సాగర్ బరిలో కృష్ణయ్య లీల - భగత్ ను భారి మెజార్టీతో గెలిపించాలని పిలుపు

 భగత్ కు మద్దతు ప్రకటించిన 47 బి.సి సంఘాలు


సాగర్ లో కులాల వారీగా ఓటర్ల సమీకరణలు జరుగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల నుండి మూడు కులాలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రేస్ పార్టి నుండి సీనియర్ నేత జానా రెడ్డి 11వ సారి పోటి చేస్తుండగా అధికార టిఆర్ ఎస్ పార్టి నుండి నోముల నర్సింహయ్య తనయుడు భగత్ పోటీలో ఉన్నాడు. బిజెపి నుండి డాక్టర్ రవికుమార్ నాయక్ పోటీలో ఉన్నారు.

ఇక ఓటర్లు కులాల వారీగా ఎంత వరకు పోలరైజేషన్ అవుతారో కాని ప్రచారంలో మాత్రం వివిద పార్టీల నేతలు ఓటర్లను కులాల వారీగా చీల్చే రాజకీయ ఎత్తుగడలు సీరియస్ గా నే కొనసాగిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టి అభ్యర్థి భగత్ కు తాజాగా 47 బీ.సి కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి.   బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షులు ఆర్‌.కృష్ణ‌య్య స్వయంగా వివిద బి.సి సంఘాల నేతలతో హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భగత్ కు మద్దతు ప్రకటించాడు.  భగత్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చాడు. అధికార పార్టి అభ్యర్థి అయినా బి.సి  సామాజిక సమీకరణం కారణంగా కృష్ణయ్య మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  ఎన్నికల ప్రచారంలో కష్ణయ్య సహా ఇతర బి.సి నేతలంతా అధికార టిఆర్ఎస్ తో జతగా ప్రత్యక్షంగా పాల్గొంటారా లేక స్వతంత్రంగా ప్రచారం చేస్తారా అనేది ప్రకటించలేదు.

సాగర్ ఉప ఎన్నికల్లో బి.సీ లందరిని ఒకే తాటిపైకి తేవాలని బి.సి నేతలు భావిస్తున్నా బి.సీల మద్య ఎంత వరకు సక్యత కలుగుతుందో చెప్పలేం. ప్రతి పార్టీలో కూడ బీ.సీలు ఉన్నారు. అట్లాగే ఎస్సీలు, ఎస్టీలు, ముస్లీం మైనార్టీలు ఉన్నారు. పార్టీలను, నేతలను బట్టి ఓట్లు వేస్తారు. అభ్యర్థి కులాన్ని బట్టి  మొత్తం అదే కులపోళ్ళంతా ఓట్లు వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. 

కృష్ణయ్య భగత్ కు మద్దతు పలకడం వెనక కులం ఉందనేది స్పష్టం అయితే ఆయన స్వతహాగా ఈ నిర్ణయం తీసుకున్నాడా లేక అధికార పార్టి మాయలోపడి మద్దతు పలికాడా అనేది అర్దం కాని విషయం.  

సాగర్ లో జనారెడ్డి సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువ. అత్యధిక సంఖ్యలో  మెజార్టి బి.సీ ఓట్లు ఉన్నాయి. ఇక బిజెపి అభ్యర్థి విషయానికి వస్తే ఎస్టి సామాజిక వర్గం ఓట్లు బిసీలతో పోలిస్తే ఐదో వంతు ఉంటాయని అంచనా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు