జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు

 


ఎన్నికల బహిష్కరణ మావోయిస్టు నక్సలైట్లు ఇచ్చే పిలుపు. కాని ఆంధ్ర ప్రదేశ్ లో  ఈ సారి మావోయిస్టులు ఆ పిలుపు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టి అధినేత మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాడు. జెడ్పిటిసి, ఎంపిటీసీలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేసాడు.

శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  చంద్రబాబు నాయుడు తమ పార్టి నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టి  పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

నూతన ఎన్నికల కమీషన్ నీలం సహాని పదవి భాద్యతలు స్వీకరించిన వెంటనే  జెడ్పిటిసి, ఎంపిటిసి ఎ్ననికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఏకగ్రీవాల పేరిట అధికార పార్టి నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టి  ఆరోపణలు చేసింది. అక్రమాలపై విచారణ జరపాలని తాము చేసిన ఫిర్యాదులను పట్టించు కోకుండా ఎస్ఈసీ  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు.  ఏపీలో ప్రజాస్వామ్యం కరువైందని బలవంతపు అక్రమ ఏకగ్రీవాలపై ఎన్నికల కమీషన్ విచారణ జరపక పోవడాన్ని నిరసిస్తు ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ పార్టి జెడ్పిటిసి, ఎంపిటిసి ఎ్ననికల్లో పేటి చేయదని అన్నారు. ఎన్నికల బహిష్కరణ అనేది ఖఠిన నిర్ణయమే అయినా తీసుకోక తప్ప లేదన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే ఎన్నికల్లో పోటి చేయరాదని నిర్ణయించాడని వైఎస్ఆర్ సిపి ఎంపి విజయ సాయి రెడ్డి ఏద్దేవా చేశాడు. వ్యాపారంలో నష్టం కలిగితే దుకాణం మూసేసి 90శాతం డి స్కౌంట్లతో ఆఫర్లు  ప్రకటించి సరుకు వదిలించుకుంటారని అది అమ్ముడు కాకుంటే ఫ్రీగా సరుకు వదిలించు కుంటారని  ప్రసుతం చంద్రబాబు నాయుడు పరిస్థితి అట్లాగే ఉందన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కృత నేతగా మిగిలాడని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు