మోది పర్యటనను నిరసిస్తు బంగ్లాదేశ్ లో నిరసనలు - విధ్వంసాలకు దిగిన ఇస్లామిస్టు గ్రూపు

 


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోది బంగ్లాదేశ్ పర్యటనను నిరసిస్తు ఇస్లామిస్ట్ గ్పూపుకు చెందిన నిరసన కారులు విధ్వంసాలకు దిగారు. బంగ్లాదేశ్ 50 వ జాతీయోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోది మార్చి 26 న ఢాకాకు చేరారు.  రెండు రోజుల పర్యటన అనంతరం మోది తిరిగి భారత్ కు చేరుకున్నారు. మోది  బంగ్లాదేశ్ లో గడిపిన రెండు రోజుల పాటు  దేశ వ్యాప్తంగా ఇస్లామిస్ట్ నిరసన కారులు నిరసనలు జరిపారు.  పోలీసుల అతి కష్టంపై నిరసన కారులను నియంత్రించారు.  అయితే మోది దేశం నుండి భారత్ కు తిరిగి వెళ్లిన అనంతరం ఇస్లామిస్ట్ గ్రూపు నిరసన కారుల నిరసనలు నిలిచి పోతాయని పోలీసులు భావించారు కాని వారు విధ్వంసాలకు తెగ బడ్డారు. వీధుల్లోకి చేరి ప్రదర్శనలు నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు ధ్వంసం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొర బడి విధ్వంసం సృష్టించారు. ఓ రైలింజన్ తో పాటు రైల్వేకోచ్ లను ధ్వంసం చేశారు. ప్రెస్ క్లబ్ పై దాడి చేసి ప్రెస్ క్లబ్ అధ్యక్షున్ని కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. బ్రహ్మన్ బారియా జిల్లాలో దేవాలయాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.

నిరసన కారులను ఆదుపు చేసేందుకు పోలీసులు పలుచోట్ల లాఠి  చార్జి చేసారు. భాష్ప వాయి గోళాలు ప్రయోగించారు. పలు చోట్ల నిరసన కారులు గాయపడ్డారు. అంతకు ముందే జరిగిన అల్లర్లలో నలుగురు వ్యక్తులు చనిపోయారని  వివిద వార్త సంస్థలు వెల్లిజించాయి. 

హిఫాజత్ - ఏ-ఇస్లాం గ్రూపు నిరసన కారులు మోది పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్ లో ముస్లీం మైనార్డీలపై విచక్షణారహిత దాడులు పరెగిపోయాయని ఆరోపిస్తు వారు నిరసనకు పాల్పడ్డారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని అధికారులు  పేర్కొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు