సురవరం ప్రతాప రెడ్డిని జర్నలిస్టులు ప్రేరణగా తీసు కోవాలి- మంత్రి దయాకర్ రావు

 


తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి ని జర్నలిస్టులు  ప్రేరణగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

నిర్భందంలోను విలువలను వదలకుండా ప్రజలకు మేలు చేసే రాతలు రాసిన ప్రతాప రెడ్డి  అందరికి ఆదర్శం కావాలన్నారు.

సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి 125వ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్...

తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం...మెఫీ (మీడియా ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్ ఇండియా)...తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్, సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి సాహిత్య, వైజ‌యంతి ట్ర‌స్టు సంయుక్తాధ్వర్యంలో   ప్రెస్ క్లబ్  లో ఆదివారం జర్నలిజంపై  జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు.

జ‌ర్న‌లిస్టులు ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి అనుసంధానంగా ప‌ని చేయాలన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇప్ప‌టి జ‌ర్న‌లిస్టులు ఈ స‌వాల్ ని స్వీక‌రించి, మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. .

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలక మన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తున్నది

ని వరంగల్ జర్నలిస్టు ల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని  తెలిపారు. 

సదస్సుకు ప్రత్యేకాఙ్వానితులుగా హాజరైన  సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణ వర్ధన్ రెడ్డి ని మంత్రి ఈ సందర్బంగా సన్మానించారు.

 ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్,ఐజెయు అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, టియుడబ్ల్యుజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు