పవన్ కు తెలంగాణలో ఉడకడం లేదు - ఆంధ్రలో మాత్రం పువ్వుల్లో పెట్టి మరి..

 కాబోయే సిఎం పవనేనట..కుండబద్దలు కొట్టిన సోము వీర్రాజు

పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోది స్వయంగా ఆంధ్ర నేతలకు ఆదేశాలు జారి చేశాడట


జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ భారతీయ జనతా పార్టీతో జత కట్టినప్పటి నుండి ఇటు తెలంగాణ తో పాటు అటు ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలనుకున్నాడు. కాని తెలంగాణ లో పాపం  ఆయన పప్పులు ఏం ఉడక లేదు. తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపద్యంలో  అధికార టిఆర్ఎస్ పార్టీ పైనా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుమారుడు కెటిఆర్ మేనల్లుడు హరీష్ రావుల పై ఓ వ్యూహం మేరకు తన దైన శైలిలో  రాజకీయ దాడి చేస్తు దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీకి మైలేజి ఇచ్చాడు. ఆయనతో పాటు ఎంపి అరవింద్ కూడ తోడు కావడంతో ఇద్దరి కాంబినేషన్ లో కెసిఆర్ పై రాజకీయ సెటైర్లతో పార్టీ  పలుకుబడి పెంచారు.. తెలంగాణా లో ప్రస్తుతం బండి సంజయ్ అనుసరించిన వ్యూహం ఆయన మంత్రం బాగా వర్క్ అవుట్ అయ్యాాయి. ఆ విషయం దుబ్బాక, జిహెచ్ ఎంసి ఎన్నికల్లో తేట తెల్లం అయింది. ఇక ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి అనుకున్న మేరకు ఫలితాలు రాబట్టుకోలేక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 

పవన్ కళ్యాన్ బిజెపితో జత కట్టిన తర్వాత ఆయన ఎక్కువగా కాలం గడిపే హైదరాబాద్ లో బిజెపి పార్టీలో అక్టివ్ రోల్ ప్లే చేయాలనుకున్నాడు కాని పార్టి నేతలు ఆయనకు సందు పుట్ట నీయ లే. దాంతో  జాతీయ నేతలతో తన పరిస్థితి మొర పెట్టుకున్నాడు. చివరికి ఎమ్మెల్సి ఎన్నికల సమయంలో తానే బయట పడి తన నెవరూ ఖాతరు చేయడం లేదంటూ ఎమ్మెల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవికి ఓట్లేయాలని ప్రకటన చేసాడు.  పవన్ ఎంతగా రాసుకు పూసుకు తీరుగుదా మనుకున్నా బండి సంజయ్ కాలిక్యులేషన్స్ మరో రకంగా ఉన్నాయి. తెలంగాణ పట్ల మొదటి నుండి వ్యతిరేక వైఖరి ప్రదర్శించిన పవన్ కళ్యాన్ వల్ల తెలంగాణలో పార్టీకి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువనే భావనలో ఉన్న  బండి సంజయ్  జాతీయ నేతల నుండి ఎంతగా ఒత్తిళ్ళు వచ్చినా  పవన్ కు చాన్స్ ఇవ్వలేదు. ఇస్తే తెలంగాణ లో పరిస్థితులు మరో రకంగా ఉండేవి.  

అందుకే ఇక తెలంగాణ విషయం పక్కన పడేసి పవన్ ఆంధ్రాలో అయినా పక్కా లోకల్ అనిపించుకోవాలని తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా గట్టి ప్రయత్నాలే చేసి కొంత సక్సెస్ కాగలిగాడు. ఉప ఎన్నికలలో మొదట జనసేన అభ్యర్థికి అవకాశం కోసం ప్రయత్నించాడు కాని  బిజెపి అందుకు అంగీకరించ లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో మాజి ఐఏఎస్ అధికారాణి రత్నప్రభను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక పవన్ కళ్యాన్ ఉప ఎన్నికల్లో స్టార్ కాంపెయిన్ కోబోతున్నాడు. అంతేకాదు ఆయనను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా హోం మంత్రి అమిత్ షా నుండి అంధ్ర బిజెపి నేతలకు ఆదేశాలు అందాయి. ఈ విషయం తిరుపతిలో జరిగిన జనసేన, బిజెపి పార్టీల సంయుక్త సమావేశంలో బిజెపి చీఫ్ సోము వీర్రాజు స్వయంగా తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీనే తనకు సూచించారని ప్రధానితో కల్సి  హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. పవన్‌ను పువ్వుల్లో పెట్టుకుని చూడాలని చెప్పారని సోము వీర్రాజు చెప్పాడు. అంతే కాదు ఆంధ్ర రాజకీయాల్లో పపన్ కీలకం కాబోతున్నాడు.  కాబోయే సిఎం అభ్యర్థిగా పవన్ ను ఎక్స్ పోజ్  చేయాలని బావిస్తున్నట్లు కూడ సోము వీర్రాజు ప్రకటించాడు. రాష్ట్రానికి కాబోయే సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అని అన్నారు. పవన్‌ను సీఎంగా చూడాలని ప్రధాని మోదీ కూడా అభిలషించారని అన్నారు. సోము వీర్రాజు మాటలను బట్టి చూస్తే ఇక ఆంధ్ర బిజెపి నేతలు పవన్ కళ్యాన్ ను భుజాలకెత్తుకుని మోయాల్సిందే మరి. తిరుపతి ఉప ఎన్నికల్లో  పవనిజం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి మరి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు