ములుగు జిల్లా లక్నావరం పర్యాటక ప్రదేశంలో రేవ్ పార్టీ ?

 మూడు నెల క్రితం జరిగిన రేవ్ పార్టి
పర్యాటక ప్రదేశం పై లోపించిన నిఘా 

పోలీసుల విచారణలో వెలుగు చూసిన రేవ్ పార్టి నిర్వహణ


యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం గాంధి నగర్ తండాలోని ఓ ఫాం హౌజ్ లో శివరాత్రి రోజు రాత్రి జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన వారినుండి పోలీసులు చాలా సమాచారం సేకరించారు.

వీరు గతంలో ములుగు మండలం లో ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన లక్నావరంలో రేవ్ పార్టీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడించారు. లక్నావరంలో  స్థానిక పోలీసులకు కూడ తెలియకుండా రేవ్ పార్టీలు జరిగాయంటే ఎంత పకడ్బందీగా రేవ్ పార్టీలు ఆర్గనైజ్ చేస్తున్నారో అర్దం చేసుకో వచ్చు. పోలీసులు తమ విచారణలో మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

రేవ్ పార్టీలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా యువకులు ఏదో విదంగా మారు పేర్లతో రేవ్ పార్టీలు అర్గనైజ్ చేస్తున్నారు.  భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలంలో ఫాంహౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీకి మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్ అనే ఈవెంట్ పేరిట యువకులను గాదర్ చేసారు. ఇందు కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా  పీఎస్ వై దమ్రూ అనే పేజీని  క్రియేట్ చేసారు.  సోషల్ మీడియా ద్వారా కాంటాక్టు అయిన 90 మందిలో   ఒక్కొక్కరి నుండి 499 రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజు వసూలు చేశారు.  

పోలీసులకు ఈ రేవ్ పార్టి కి సంభందించిన పక్కా సమాచారం లభించడంతో  రైడ్ చేసి శినరాత్రి రోజు (మార్చి 11 న )  పట్టుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 97 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు ఉన్నారు. వీరి నుండి 120 మద్యం బాటిళ్ళు,  గంజాయి, డ్రగ్స్ తో పాటు లాప్ టాపులు, సిగరెట్ పాకెట్లు,76 సెల్ ఫోన్లు, 15 కార్లు, 30 బైకులు పోలీసులు స్వాదీనం చేసుకన్నారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రేవ్ పార్టీపై ఇంకా విచారణ జరుగుతోందని వారికి డ్రగ్స్, గంజాయి సప్లై చేసిన వారి గురించి కూడ ఆరా తీసామని తెలిపారు. మూడు నెలల క్రితం ములుగు జిల్లా లో పర్యాటక ప్రాంతం అయిన లక్నావరంలో కూడ రేవ్ పార్టి నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారని చెప్పారు.  పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగిందని కమీషనర్ చెప్పారు. 

ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి శ్రీకర్ రెడ్డి,ఈసీఐఎల్ కు చెందిన పేపర్ ప్రొడక్ట్ వ్యాపారి గిరీశ్ దడువాయ్,వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్  ఉమర్ ఫారూఖ్ తదితరులు   రేవ్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. రేవ్ పార్టి జరిగింది  శ్రీకర్ రెడ్డి తండ్రి ధన్వంత్ రెడ్డికి చెందిన ఫాం హౌజని వీరికి సూర్యాపేట జిల్లా బాలాజీనగర్ కు చెందిన బాలెంల ప్రవీణ్ అనే వ్యక్తి డ్రగ్స్ సమకూర్చాడని చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు