తిరుపతిలో బిజెపికి వై.సి.పి సిట్టింగ్ స్థానం గెలవడం అంత ఈజి కాదు

 తిరుపతిలో పవర్ కళ్యాన్ పవర్ చూపించ బోతున్నాడా ?
కమలం వికసించ బోతోందా ?
సిఎం జగన్ మోహన్ రెడ్డి అంత తేలిగ్గా వదులు కుంటాడా ?


తిరుపతి లోక్ సభ  స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి తన అభ్యర్థిని నిలిపేందుకు మార్గం సుగమమ మైంది. పవన్ కళ్యాన్  ముందు నుండి ఈ సీటు కోసం పట్టుబట్టినా బిజెపి అనేక కారణాల వల్ల అంగీకరించ లేదు.దాంతో పవన్ తన పట్టు సడలించి చివరికి బిజెపి ప్రతిపాదనను అంగీకరించక తప్పింది కాదు.

అయితే బిజెపి కూడ ఈ సీటులో గెలవడం అంత ఆశా మాషి వ్యవహారం ఏం కాదని విశ్లేషకులు  అభిప్రాయ పడుతున్నారు.

తిరిపతి సీటు అధికార బై.ఎస్ ఎర్ పార్టి సిట్టింగ్ సీటు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుండి ఆ పార్టి అభ్యర్థిగా గెలిచిన బాల్లి దుర్గాప్రసాద్ రావు 7,22,877 ఓట్లతో తన సమీప టిటిడి అభ్యర్థి   పనబాక లక్ష్మి పై సుమారు 2 లక్షల పై చిలుకు ఓట్ల భారి ఆధిక్యతతో గెలిచాడు. కాంగ్రేస్ పార్టీకి బిజెపి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కక పోగా నోటాకు పడిన ఓట్లుకూడ పడ లేదు. నోటాకు 25,781 ఓట్లు పోలవగా  బిజెపి అభ్యర్థి బొమ్మి శ్రీహరికి  కేవలం 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రేస్ పార్టీకి 24,039 ఓట్లు పోలయ్యాయి.

ఈ లెక్కన చూస్తే బిజెపీకి గెలుపు అంత సులువు కాదు. కాని పరిస్థితులు రాజకీయ సమీకరణలు మారిన నేపద్యంలో  ప్రస్తుతం బిజెపికీ పవన్ కళ్యాన్  జన సేన పార్టి మద్దతు ఇస్తోంది. తెలంగాణ లో బిజెపి బాగా పుంజు కొవడం చూసి ఆంధ్ర లో కూడ బిజెపీకి తిరుపతి ఉప ఎన్నికల్లో బాగా కల్సి వస్తుందని చెప్ప లేం. ఎందుకంటే తెలంగాణ లో పరిస్థితులు వేరు ఆంధ్రలో పరిస్థితులు వేరు. తెలంగాణ లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అ నూహ్యంగా బిజెపి అభ్యర్థి గెలిచి రాజకీయ అంచనాలను తలకిందులు చేశాడు. అనంతరం జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పోరాడి మేయర్ పీఠం దక్కేంతగా మాజిక్ ఫిగర్ సంపాదించ లేక పోయినా అధికార పార్టీకి ముచ్చెమటలు పుట్టించింది. బిజెపి బలాన్ని తక్కువగా అంచనావేసిన టిఆర్ఎస్ పార్టీకి జిహెచ్ ఎంసి ఎన్నికల ఫలితాలు వెన్నులో వణుకు పుట్టించాయి. 

వీటన్నిటి కన్నా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దూకుడు ఆ పార్టీకి ఎంతగానో కల్సి వచ్చింది. ఆయన తెలంగాణ లో బలంగా ఉన్న బి.సి క్యాటగరీలో ఉన్న  కాపు సామాజికి  వర్గానికి చెందిన వాడు కావడం బాగా కల్సి వచ్చింది.  తెలంగాణ సిఎం కెసిఆర్  తన స్వయం కృతం మేరకు తన ఇమేజిని తానే మసక బారేట్లు చేసుకోవడంతో ప్రజలు బిజెపి లో  ప్రత్యామ్నాయం వెదుకున్నారు. 

కాని ఆంధ్రలో పరిస్థితులు వేరు గా ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ సోము వీర్రాజు తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ లెక్కనే చిన్న తనం నుండి  కాశాయ కూటమి నేపద్యం కలిగిన వాడు. కాని తెలంగాణ  ప్రభుత్వంపై  తెలంాగణ లో కనిపించిన వ్యతిరేకత ఆంధ్రలో సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన విషయంలో కనిపించడం లేదు. జగన్ అధికారం లోకి వచ్చి కేవలం ఏడాది మాత్రమే దాటింది. 

ఇక జన సేన పార్టీ బలం ఆ పార్టి చీఫ్ పవన్ కళ్యాన్ గ్లామర్   బిజెపి ని గెలిపించేంతగా తోడ్పతాయని చెప్పలేం. పోటీలో తులుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలుపుతోంది. కాంగ్రేస్ పార్టి కూడ తన అభ్యర్థిని నిలుపడం ఖాయం. ఈ పరిస్థితిలో గత ఎన్నికల్లో డిపాజిట్ కూడ దక్కని బిజెపి ఎకా ఎకిన గెలుపు దిశగా ఎదిగి పోగలదని భావించడం అత్యాశే కాగలదు.  సిఎం జగన్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోకుండా తేలికగా వదిలి పెట్టే పరిస్థితి లేదు. ఆయన జన హితంగా పాలన సాగించే విదంగా వినూతన  సంక్షేమ పథకాలతో వారి మనస్సుల్లో ముద్ర వేసుకునేందుకు సర్వ విధాలా  ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా  సంక్షమ పథకాల విషయంలో వెనక్కి తగ్గలేదు.

ఈ పరిస్థితుల్లో సిఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ సీటును టిటిడి కో లేదా బిజెపికో వదిలి చేతులు కట్టుకు కూర్చోవడం అసలు జరిగే పనేనా ?

 అనేది ప్రశ్న. బిజెపి అత్యుత్సాహంతో ఉన్నా పవన్ కళ్యాన్ తన పవరంతా చూపి  కళ్లెం లేని గుర్రంలా రంకెలు వేసినా ఓట్లు ఎంత వరకు పోది చేయ గలరో చూడాలి. ఓ క వేళ ఎపిలో జగన్ ను ఎదురు గాలి వీచి బిజెపి గెలిస్తే ఒక్క ఎపి లోనే కాదు యావత్ భారత దేశ రాజకీయాలను ఈ తీర్పు తల కిందులు చేస్తుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు