పెరుగుతున్న కరోనా కేసులు - తెలంగాణ లో 216 కేసులు నమోదు

 


దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.  తగ్గినట్లే తగ్గిన కరోనా తిరిగి పెరుగుతుండడంతో  ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 24,882 కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దేశంలో గడిచిని 24 గంటల వ్యవదిలో 140 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 1,58,446 కు చేరింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728 కి చేరింది. 

దేశ వ్యాప్తంగా 1,09,73,260 మంది కరోనా భారిన పడి వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,02,022 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి.  మార్చి 12 న 8,40,635 కరోనా పరీక్షలు నిర్వహించారు. మార్చి 12వ తేదీ వరకు మొత్తం 22,58,39,273 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

తేలంగాణలో 216 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ర్ట, కర్నాటక లోకేసులు ఆందోళన కరంగా పెరుతుండడంతో  అప్రమత్తం చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్విహంచి తాజాగా ఆదేశాలు జారి చేశారు. అన్ని జిల్లా కేంద్రాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.  ఐసో లేషన్ వార్డులతో పాటు హోం క్వారెంటైన్ లో ఉన్న వారికి వైద్య సేవలు అందించాలని సూచించారు.  కరోనా టెస్టుల సంఖ్య రోజుకు 50 వేల వరకు నిర్వహించాలని ఆదేశించారు. 

తెలంగాణ లో మార్చి 12 వ తేదీన 216 కరోనాకేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతి చెందగా 1,918 కరోనా పాజిటివ్ కేసులు అక్టివ్ గా ఉన్నాయి. వీరిలి 759 మంది హం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిదిలో 52 కేసులు నమోదు అయ్యాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు