పరేశాన్ లో పవన్ కళ్యాన్

 తెలంగాణ లో జన సేన బిజెపి  మద్య పొసగని పొత్తులు 


బండి సంజయ్ వర్సెస్ పవన్ కళ్యాన్ మరో వైపు రాములమ్మ 

తెలంగాణ లో జనసేన బిజెపి ల మధ్య స్పష్టత లేని మైత్రి


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తన మిత్ర పక్షమైన బిజెపితో సక్యత సరిగ్గా కుదరక పరేశాన్ లో పడ్డారు. ఎపిలో ఉప ఎన్నికలు జరుగనున్న తిరుపతి స్థానం లో  బిజెపి జన సేన ఉమ్మడి అభ్యర్థిగా తన పార్టి అభ్యర్థిని నిల బెట్టాలని చాలానే ప్రయత్నాలు చేశారు. కాని వర్కౌట్ కాలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో  ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి అభ్యర్తి పోటి చేయబోతున్నారు. జన సేన అభ్యర్థికి  తిరుపతిలో పోటి చేసే అవకాశం దక్కక పోవడంతో పవన్ కళ్యాన్ కొంత నిరుత్సాహం లో పడ్డారు. పవన్ కు  అటు ఎపి లోను ఇటు తెలంగాణ లోను ఆయన ఆశించిన రీతిలో పరిస్థితులు అనుకూలించటం లేదు. దాంతో చిర్రెత్తి పోయి మిత్ర పక్షం అయిన బిజెపి పై మండిపడ్డారు. పార్టి ఆవిర్భావ దినోత్సవంలో సారు అగ్రహో దగ్రు డయ్యారు. ప్రధానంగా తెలంగాణ బిజెపి నాయకత్వాన్ని టార్గెట్ చేసిన విమర్శలు చేయడమే కాక ఎమ్మెల్సి ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న రోజు తప్పుడు సంకేతాలు వెళ్లేలా టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. 

తెలంగాణ బీజేపీపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు.  జనసేనను చులకన చేసేలా బీజేపీ మాట్లాడిందని ఆరోపించారు. బీజేపీ తమను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. అందుకే తాము తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని పవన్ కొనియాడారు. 

 పవన్ నిర్ణయం బిజెపి తెలంగాణ నాయకత్వాన్ని ఇరకాటం లో పడేసింది. దాంతో తెలంగాణ చీఫ్ బండి సంజయ్  పవన్ కు కౌంటర్ రిప్లై ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు సమర్థించటం దేనికి సంకేతం? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. పవన్‌కు ఏదైనా ఇబ్బంది ఉంటే కేంద్ర నాయకత్వం లేదా తన దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు. అంతే కాదు  జనసేన పార్టీతో తామెప్పుడు  పొత్తుపై  చర్చలు జరపలేదని సంజయ్‌ పవన్ కళ్యాన్ కు చురకలు వేశారు.

బిజెపితో పొత్తు విషయంలో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ లో కూడ పొత్తు ఉన్నట్లే పవన్ కళ్యాన్ భావిస్తున్నా తెలంగాణ బిజెపి నాయకత్వం ఆయన పొత్తును లెక్కలో తీసుకోవడం లేదనేది బండి సంజయ్  స్పష్టంగా చెప్పిన మాటల్లో అర్దం చేసుకోవచ్చు. 

 అసలు పొత్తు విషయం మాట్లాడనపుడు జనసేన ఎవరికి మద్దతు ఇస్తే ఏంటనే ప్రశ్న కూడ తలెత్తుతుంది కదా. మొత్తానికి తెలంగాణ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ బిజెపితో కల్సి జమిలిగా ప్రయాణం చేయాలనుకుంటే తన స్వంత వ్యూహాలతో ఒంటరి ఎత్తులతో పాపులర్ అవుతు ఇమేజ్ పెంచుకుంటున్న బండి సంజయ్  పవన్ ఎంట్రీకి చాన్స్ ఇవ్వటం లేదు. అంతెందుకు మొన్నటి వరకు కాంగ్రేస్ పార్టీలో కొన సాగి బిజెపి లో చేరిన విజయ శాంతి ని  బండి సంజయ్ సరిగ్గా పట్టించు కోవడం లేదని ఆమె కూడ గుర్రుగా ఉన్నారని పార్టి  వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే బండి సంజయ్  ఆలోచనలు వేరే విదంగా  కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాన్ కాని లేదా విజయ శాంతి కాని తెలంగాణ లో నెల కొని ఉన్న పరిస్థితులను అర్దం చేసుకోకుండా ఎమోషనల్ అయి మాట్లాడి  గందరగోళ పరిచే అవకాశాలు ఉన్నాయన బండి సంజయ్ ప్రస్తుతం వారి అవసరాన్ని కోరడం లేదని విశ్లేషణలు ఉన్నాయి.

బిజెపి పొత్తు కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కొన సాగుతుందా తెలంగాణ లో జన సేన ంటరిగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటి చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పపన్ కళ్యాన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తమ పార్టి అభ్యర్థులను నిల బెట్టనున్నట్లు  సంకేతాలు పంపుతుండటం గమనార్హం. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు