జగన్ బాబు.. మందు బాబుల విన్నపాలు విన వలే

 


అంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియలకు కష్టాలు చాలా ఉన్నాయి. ఎన్నికల సమయంలో మహిళలకు జగనన్న ఇచ్చిన హామి మేరకు ఆయన సిఎం అయినంక మద్యం ధరలు ప్రియం చేసి షాక్ ఇవ్వడమే కాక మద్యం నుండి మద్య పాన ప్రియులను  దూరం చేసేందుకు అనేక నియంత్రణలు  అమలు చేశాడు. 

  అన్ని అగ్ని పరీక్షలు భరించి మద్యం ప్రియిలు మద్యపానం మాన లేక తాగేస్తున్నారు. సరే అని సరిపెట్టుకుంటే బ్రాండ్ల గోల వారికి పిచ్చెక్కిస్తోంది. జగన్ అన్న సర్కార్ అధికారంలోకి వచ్చిన     తర్వాత గతంలో ఉన్న బ్రాండ్లను మార్చేసి కొత్త బ్రాండ్లను ప్రవేశ పెట్టింది. ప్రీమియం బ్రాండ్ల విషయంలో సమస్య లేదు. సమస్య అంతా తక్కువ ధరల బ్రాండ్ల విషయం లోనే. ఎక్కువ శాతం తక్కువ ధరల  బ్రాండ్లు  సేల్ అవుతుంటాయి. కొత్త బ్రాండ్లు సరిగా లేవని బ్రాండ్లు మార్చాలని మద్యం ప్రియలు మొత్తుకున్నా సర్కార్ ససేమిరా అనడంతో చివరికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి నంద్యాల తాగుబోతులు బాలెట్ పత్రాలతో  పాటు తమతమ విన్నపాలు విన వలె నంటూ చీటీలపై రాసారు. మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు, హైదరాబాద్‌, జంబో వంటి వాటిని తొలగించి పాత బ్రాండ్లు అయిన రాయల్‌ స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ, బ్లాక్‌ డాగ్‌ రకాల అమ్మకాలు జరపాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. తెల్ల కాగితం మీద ముద్రించిన చీటీలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల సిబ్బంది గుర్తించారు. నంద్యాల తాగుబోతుల విన్నపం పేరిట ఉవ్న చీటీలను బాలెట్ బాక్సులలో కనుగొన్నారు. ఒక వేళ తమ విన్నపం పెడ చెవిన పెడితే ఇవే తాగుబోతులు ఓటు వేసే ఆఖరి ఎన్నికలు అవుతాయని కూడ అందులో హెచ్చరించారు.

చీఫ్ లిక్కర్ బ్రాండ్ల విషయంలో గతంలో తెలుగుదేశం పార్టి కూడ ప్రభుత్వం విమర్శలు చేసింది. దేశంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను  రాష్ట్రంలో అమ్ముతున్నారని అవన్ని వై.ఎస్. ఆర్ పార్టి ఎమ్మెల్యేల కంపెనీల్లో తయారు చేసినవని ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు