బిజెపి లోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి


కాంగ్రేస్ పార్టీలో కొనసాగుతున్న మాజి ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ విషయం అయన స్వయంగా సోమవారం తన అనుచరులకు వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రేస్ పార్టీకి రాజీనామా చేస్తు టిపిసిసి అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి రాజీనామా లేఖ పంపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బిజెపి లో చేరాలని ఆహ్వానించగా కొంత సమయం కావాలని అడిగారు. గతంలో ఇచ్చిన మాట మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి ఎంపిగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రేస్ పార్టీలో చేరారు.  చేవెళ్ల నుండి పోటి చేసి తెరాస అభ్యర్థి చేతిలో ఓడి పోయారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామిక వేత్తే కాక విద్యాధికుడు కూడ. ఆయనను 2013 లో తెలంగాణ  రాష్ట్ర సమితి పార్టీ లోకి అహ్వానించారు. విశ్వేశ్వర్ రెడ్డి తాత కొండా వెంకట రంగారెడ్డి. స్వాతంత్ర్య సమర యోధుడే కాక నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన పేరిటనే రంగారెడ్డి జిల్లా అప్పట్లో ఏర్పాటు చేసారు. బిజెపి లోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరడం వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరనుందని బిజెపి పార్టి నేతలు భావిస్తున్నారు. తెలంగాణ లో గతంలో రెడ్లు కాంగ్రేస్ పార్టీలో ఎక్కువ శాతం కొన సాగారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రెడ్లు ఒకే పార్టీలో కొనసాగడం సాధ్య పడ లేదు. పార్టీల వారీగా చీలి పోయారు.  ప్రస్తుతం కేంద్రంలో అధికారం లో  ఉన్న బిజెపి లేదా రాష్ట్రంలో అధికారంలో  ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల లోకి రెడ్ల వలసలు కొనసాగుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు