దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్‌ వేడు‌కలు

సబర్మతిలో ప్రధాని నరేంద్ర మోది హైదరాబాద్ లో కెసిఆర్ వరంగల్ లో గవర్నర్ 


భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేంద్రం తలపెట్టిన ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్‌ ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం  దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. 

గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ప్రధానంమంత్రి నరేంద్ర మోది జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సబర్మతి నుండి దండి వరకు మహాత్మగాంధి ఇదే రోజు మార్చ్ ప్రారంభించారు.  

ముందుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లిన మోది మహాత్మ గాంధి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభయ్ ఘాట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ను ప్రధాన తిలకించారు. అనంతరం81 మందితో 241 మైళ్ల వరకు సాగే పాద యాత్రను మోది ప్రారంభించారు. 25 రోజుల పాటు సాగే పాద యాత్ర దిండి వద్ద ఏప్రిల్ 5 వ తేదీన ముగియనుంది. 

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు.  లోక‌మాణ్య తిల‌క్ పూర్ణ స్వ‌రాజ్యం పిలుపును మరిచిపోలేమ‌న్నారు. మంగ‌ళ్ పాండే, తాంతియా థోపే, రాణీ ల‌క్ష్మీభాయ్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌, భ‌గ‌త్ సింగ్‌, పండిట్ నెహ్రూ, స‌ర్దార్ ప‌టేల్‌, అంబేద్క‌ర్ లాంటి వారు మ‌న‌కు ప్రేర‌ణ‌గా నిలిచార‌న్నారు. దేశ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు యువ‌త‌, విద్యావంతులు బాధ్య‌త తీసుకోవాల‌ని మోదీ పిలుపునిచ్చారు.  మ‌న దేశం సాధించిన ఘ‌న‌త‌ను ప్ర‌పంచ దేశాల‌కు తెలియ‌జేయాల‌న్నారు.  

వోకల్ ఫర్ లోకల్ 

ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని వోకల్‌ ఫర్‌ లోకల్‌ యాష్‌ ట్యాగ్‌తో  లోకల్ వస్తువులు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయాలని ట్విట్టర్ లో పిలుపు నిచ్చారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడమే గాంధీకి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అన్నారు.

తెలం‌గా‌ణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌బ్లిక్ గార్డెన్ ‌లో వేడుకలను ఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతు శాసనోల్లంఘన ఉద్యమానికి, సంపూర్ణ స్వాతంత్రోద్యమానికి గాంధీజి ఇదే రోజు పిలుపు నిచ్చారని గుర్తు చేశారు.  దండిగ్రామంలో గాంధీజీ సింహంలా గర్జించారుని అది దేశం నలుమూలలా దావానంలా వ్యాపించిందని,  ఆనాడు గాంధీజీ అద్భుతమైన ఉద్యమ వ్యూహ రచన చేశారని  20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో  సహచరులతో గాంధీజీ వ్యూహ రచననే స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించానని కెసిఆర్ అన్నారు. అదే రీతిలో అహింసాయుతంగా గాంధీ  చూపిన  మార్గం లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ వివరించారు. 

దేశవ్యాప్తంగా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు 75 వారా‌ల‌పాటు ఈ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. గవ‌ర్నర్‌ తమి‌ళిసై సౌంద‌ర్‌‌రా‌జన్‌ వరం‌గ‌ల్‌లో జాతీయ జెండాను ఆవి‌ష్క‌రించి ఉత్స‌వా‌లను ప్రారం‌భించారు. గురు‌వారం బీఆర్కే భవ‌న్‌తోపాటు ప్రభుత్వ భవ‌నాలు, జంక్షన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు