గీత కథ సుఖాంతం కాబోతోందా ?

 మహారాష్ట్రలో ఓ గ్రామంలోతన తల్లిని కల్సిన గీత
డిఎన్ ఏ పరీక్షల్లో నిర్దారణ అయితే అప్పగింత


చిన్న వయసులో తప్పి పోయి  పాకిస్తాన్ చేరిన గీత కేసు సుఖాంతం కానుంది. పాకిస్తాన్ కు చెందిన డాన్ వార్త సంస్థ వెల్లడించిన వివరాల మేరకు గీత మహారాష్ట్రలో తన తల్లిని కలిసిందని డిఎన్ఏ పరీక్షలు కూడ నిర్వహించారని అయితే ఇంకా ఫలితాలు రావల్సి ఉందని పేర్కొంది. 

పర్బని జిల్లాలో గీత తన తల్లిను కల్సిందని డిఎన్ఏ ఫలితాలు వస్తే పూర్తి నిర్దారణ జరుగుతుందని పాకిస్తాన్ లోని కరాచీలోని ఈధీ వెల్ఫేర్‌ ట్రస్టు అధ్యక్షురాలు బిల్కిస్‌ ఈధీ ని ఉటంకిస్తు వార్త  సంస్థ వెల్లడించింది. 

2015 అక్టోబర్ లో గీతను బిల్కిస్‌ ఈధీ వెంట బెట్టుకుని భారత్ తీసుకు వచ్చారు. అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో  స్వచ్చంద సంస్థల తో కల్సి గీత తల్లి దండ్రుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. భారత్‌కు వచ్చిన గీత బాధ్యతలను ప్రభుత్వం నిర్ణయం  మేరకు  ఇండోర్‌లోని ఆనంద్‌ సర్వీసెస్‌ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రస్తుతం గీత భాద్యతలు చూస్తోంది. ఆ సంస్థకు చెందిన ట్రస్టి గ్యానేంద్ర పురోహిత్  గీత మూగ సైగలను అర్దం చేసుకునే అవగాహన ఉండడంతో ఆమె చెప్పిన వివరాల మేరకు గీత గ్రామం గుర్తించారు.  గ్రామంలో ఓ నదితో పాటు ఓ దేవాలయం పక్కనే తమ ఇళ్ళు  ఉండేదని గీత వివరించిందని డాన్  వార్త సంస్థ పేర్కొంది.  గీత చెప్పిన వివరాలతో మహారాష్ట్ర లోని నాందేడ్, నాసిక్ జిల్లాల్లో పర్యటించారు. ఆఖరికి పర్బని జిల్లాలో నయీగాంవ్‌ అనే గ్రామంలో గీత తన తల్లిని సోదరిని కల్సుకోగలిగారు.  అయితే డిఎన్ ఏ నిర్దారణ అనంతరమే గీతను వారికి అప్పగించనున్నారు. 

ఇప్పటి వరకు  అనేక మంది దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి గీత తమ కూతురే నంటూ వచ్చారు కాని ఎవరి డిఎన్ఏ కూడ నిర్దారణ కాలేదు. చిన్నతనంలో 11 ఏల్ళ వయస్సులో సమ్ఝౌతా ట్రైన్ లో తప్పి పోయి పాకిస్తాన్ లోని కరాచి చేరుకున్న గీతను ఈధీ వెల్ఫేర్‌ ట్రస్టు  చేర దీసింది. అక్కడే 2015 వరకు గీతను తల్లి దండ్రులను గుర్తించి వారికి అప్పగించేందుకు ఇండియాకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం గీత వయస్సు 23 సంవత్సరాలు. 

ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల మేరకు గీత తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. గీత అసలు పేరు  రాధా వాఘ్‌మారే. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు