వరంగల్ లో తగ్గని ఉద్రిక్తత - బిజెపి వర్సెస్ టిఆర్ఎస్

 

బిజెపి అర్బన్ అద్యక్షురాలు రావు పద్మ సహా 39 మందికి 14 రోజుల రిమాండ్

గులాబి వర్సెస్ కమలం పరస్పర దాడులు

బిజెపి అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను జైళుకు తరలిస్తున్న పోలీసులు

హన్మకొండ లో గులాబీ నేతలకు కమల దళానికి మద్య రాజుకున్న  నిప్పు ింకా చల్లార లేదు. ఆదివారం రాత్రి ఇరు పార్టీల నేతల ఇండ్లపైన ఆఫీసులపైనా పరస్పర దాడులు జరుగగా పోలీసుుల అతి కష్టంపై అదుపులోకి  తెచ్చారు. బిజెపి అర్బన్ జిల్లా అద్యక్షురాలు రావుపద్మ సహా ఇతర నేతలను కార్యకర్తలను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత వారిని ఓ ఫంక్షన్ హాలుకు తరలించారు. రావు పద్మను రాత్రి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేసారు. తెల్లవారి మిగతా బిజెపి నాయకులను ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేసి కేసులో 53 మందిపై  కేసులు నమోదు చేసి అరెస్టు అయిన వారిలో 42 మందిని కోర్టులో హాజరు పరిచి  జైళుకు తరలించారు. అయితే  సోమవారం కూడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. హన్మకొండకు వస్తున్న బిజెపి నేతలు మాజి ఎంపి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ లను పోలీసులు మార్గ మద్యంలో అడ్డుకున్నారు. రాజాసింగ్ ను ఆలేరు వద్ద అడ్డుకోగా జితేందర్ రెడ్డిని భువనగిరి వద్ద అడ్డుకున్నారు.

వరంగల్ వచ్చే రహదారులలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి  బిజెపి నాయకులను ఎవరిని బయటి నుండి వరంగల్ వైపు అనుమతించ లేదు.  బిజెపి అర్బన్ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించి బిజెపి నేతలను ఎవరిని నిరసనకు ఆందోళనలకు  అనుమతించ లేదు. అర్బన్ జిల్లా అద్యక్షురాలు రావు పద్మ మరో ఐదుగురు మహిళా నేతలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా 14 రోజుల రిమాండ్ కు ఆదేశించడంతో వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. 

అట్లాగే రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి, గురుమూర్తి శివ కుమార్, రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, బాకం హరిశంకర్ లతో పాటు  మొత్తం 36 మందిని రిమాండ్ చేసారు.

అరెస్టులకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు నిచ్చింది.  నల్ల బాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించి నిరసన తెలపాలని భాజపా నేతలు పిలుపు నిచ్చారు.

పోలీసుల సమక్షం లోనే దాడులు రావుపద్మ

యువరాజు మెప్పు కోసం రామ భక్తులను  హిందూ సమాజాన్ని టిఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని బిజెపి ఆర్బన్ జిల్లా అద్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. ఎమ్మెల్యే చల్ల ధర్మా రెడ్డి  రామ మందిరం విషయంలో అవమాన కరంగా మాట్లాడటం ఇది రెండోసారని అన్నారు. పోలీసుల సమక్షంలోనే బిజెపి నాయకుల ఇండ్లపైనా కార్యాలయాలపైనా దాడులు జరిగాయని రావు పద్మ ఆరోపించారు. పరకాలలో బిజెపి కార్యాలయానికి నిప్పు పెట్టారని అన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకునిపై కేసు పెట్టడం కాని అరెస్ట్ చేయడం కాని జరగ లేదన్నారు. టిఆర్ఎస్ పాలనలో అరాచకాలు  రజాకార్లను మించి పోాయాయన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం విషయంలో ప్రతి ఒక్క హిందువు భాద్యుడు అవుతున్నాడని అన్నారు. కావాలనే టిఆర్ఎస్ నేతలు  రెచ్చగొట్టి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రామ మందిరం విరాళాల విషయంలో హిందు సమాజం అంద చేస్తున్న  ప్రతి పైసకు లెక్క ఉందని అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు