నోటి దూల ధర్మారెడ్డి - క్షమాపణలతో వేడుకోలు

 అధికార పార్టీకి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి నోటి దుల కు జనం రివర్స్ అవుతున్నారు.  రామ మందిరం విరాళాల విషయంలో నోరు జారిన ఎమ్మెల్యే బిజెపి ఆగ్రహానికి గురయ్యాడు. మరో వైపు  బిసి, ఎస్సి,ఎస్టి ఉద్యోగుల ను ఉద్దేశించి అవమాన కరంగా మాట్లాడారు.  జిల్లా కేంద్రంలో జరిగిన ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ల అమలు సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడిన మాటల పై పలు సంఘాలు మండిపడ్డాయి. 


రామ మందిరం విరాళాల విషయంలో  బిజెపి నేతలపై నోరు పడేసుకున్న  అధికార టిఆర్ఎస్ పార్టి పరకాల ఎమ్మెల్యే  ధర్మారెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నాడు. జనవరి 31 వ తేదీన  అగ్ర కులాల  సదస్సులో బిసి, ఎస్సి, ఎస్టి కులాల వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన మాటలకు నిరసనగా సోమవారం బిసి,ఎస్సి, ఎస్టి సంఘాలు నిరసన తెలిపాయి. దాంతో ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు కోరక తప్పలేదు.

ఇడబ్య్లు ఎస్ రిజర్వేషన్ల అమలు సదస్సులో తన మాటలు వక్రీకరించారని ఎమ్మెల్యే ధర్మా రెడ్డి అన్నారు. ఎవరినైనా తెల్సి తెలియకు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. అయితే తనపై కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

చిన్న కులాలను అవమానించాడు బిసి, ఎస్సి ,ఎస్టి  ప్రజా సంఘాల నేతల  ఆగ్రహం

 చిన్న కులాలకు చదువు రాదు.. పని రాదు, వాళ్ళు ఉద్యోగాలు పొంది రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి జనవరి 31 వ తేదీన జరిగిన సదస్సులో అవమానిస్తూ ఇడబ్య్లు ఎస్ రిజర్వేషన్ల అమలు సదస్సులో మాట్లాడారని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్ల కొండ వేణుగోపాల్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట రవి మాదిగ, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పోరిక ఈశ్వర్ సింగ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను అక్కరకు రాని వారి కింద జమ కట్టి  రాజ్యాంగాన్ని కించ పరిచిన వ్యక్తికి ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు లేదని అన్నారు.


బిజెపి అర్బన్ అద్యక్షురాలు రావు పద్మ సహా 39 మందికి 14 రోజుల రిమాండ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు