నయవంచక తెలంగాణ పత్రిక

  ఉపాధ్యాయ సంఘాల మండిపాటు


ఉద్యమకాలంలో ప్రముఖ పాత్ర పోషించిన నమస్తే తెలంగాణ పత్రిక కాదు ఇప్పుడు నడుస్తున్న పత్రిక నయవంచక తెలంగాణ పత్రిక కాదు కాదు తెలంగాణ సమాజాన్ని అమరవీరుల త్యాగాలను ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పోరాటాలను నేడు తక్కువ చేసి చూపిస్తున్న నయవంచక పెట్టుబడిదారుల మానస  విష పుత్రిక.

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలకు పోరాటాలకు కేంద్రంగా మారిన ఉద్యోగులను ఉపాధ్యాయులను ఆకాశానికి ఎత్తుతూ ఎన్నో వ్యాసాలు రాసిన పత్రిక నేడు నయా నయవంచక పెట్టుబడి దారి కబంధహస్తాల్లో చిక్కుబడి అదే ఉపాధ్యాయులను ఈరోజు టార్గెట్ చేస్తూ అసలు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులే కాదు పంచాయతీరాజ్ వ్యవస్థలో పని చేసే పని మనుషులు అన్న చందంగా రాశారు.

వ్యాసం రాసిన వారు "స్వప్న" అని కింద ఒక మహిళ పేరు రాశి పత్రికా యాజమాన్యం పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది.

ఇంటి పేరు లేదు ఊరు పేరు లేదు కనీసం సెల్ నెంబర్ లేదు. మహిళ అన్న గౌరవంతో ఎవరు టార్గెట్ చేసి మాట్లాడరు దాడి చేయరు తెలంగాణ సమాజం మహిళలకు చాలా గౌరవం ఇస్తుంది అని వారి విశ్వాసం.


వేసవి సెలవులు ఉపాధ్యాయులకు ఇస్తున్నారా లేక  విద్యార్థులకు ఇస్తున్నారా అన్న కనీస అవగాహన లేకుండా రాయించారు.

వేసవి సెలవులు అనేటివి ఈనాటి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులకు ఇస్తున్నది కాదు, విద్యార్థి మానసిక శారీరక స్థితిని, వాతావరణ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పూర్వకాలంనుండే ఎండాకాలంలో విద్యార్థులు తీవ్రమైన ఎండకు తాళలేరని మేధావులు విద్యావేత్తలు ఆనాటి రోజున రాజకీయ నేతలు ఎంతగానో చర్చించి ఆలోచించిన తర్వాతనే 50 రోజులు సెలవులు ఇస్తారు. ఇది బ్రిటిష్ వారి కాలం నుండి అమలవుతున్న విధానం కొత్తగా వచ్చింది కాదు.

ఇంగిత జ్ఞానం లేని రాతలు రాయడం సరికాదు‌.

అసలు స్వప్న గారు బడిపంతుల్ల దగ్గర నేర్చుకుందా చదువు బర్లు దుడ్డెల దగ్గర నేర్చుకుందా?

సార్ల దగ్గర నేర్చుకుందా సన్నాసుల దగ్గర నేర్చుకుందా చదువు.

నీకు అక్షరాలు దిద్దించిన చేతులు ఈరోజు సిగ్గుతో ముడుచుకుపోతున్నాయి.

అసలు ఈమెకు పిల్లలు ఉన్నట్లయితే తీవ్రమైన ఎండలో కూడా పిల్లలను బడికి పంపించవచ్చు విద్యార్థులకు ఉపాధ్యాయులకు సెలవులు అవసరంలేదు అని  శాస్త్రీయంగా నిరూపించగలదా?

జీతాల పెరుగుదల ఉపాధ్యాయులకు అవసరం లేదు అనేది మరో పిచ్చి వాదన.

మరి ఎవరికి పెంచాలి?

అసలు మీ పత్రిక తెరచాటు యజమాని ముఖ్యమంత్రి కుటుంబం నెల జీతాల డబ్బులు ఎన్నో తెలుసా? దాదాపు 12 లక్షలు. వాళ్ల అలవెన్సులు వాళ్ల దగ్గర పనిచేసే ఉద్యోగుల ఖర్చులు. వాళ్ల కాన్వాయ్ కోర్సులు వారు కట్టుకున్న నిర్మించుకున్న రాజరికపు కోటల ఖర్చులు అవి నీకు కనబడటం లేదా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉపాధ్యాయులను విద్యా వ్యవస్థను పాఠశాలలను ఈ రాష్ట్ర  ప్రభుత్వం ఏమి ఉద్ధరించారో మీకు తెలుసా? ఒక్క పాఠశాలలో అదనపు గది నిర్మించారా ఎక్కడో అరా ఒక్కటి నిర్మిస్తే గత నాలుగు సంవత్సరాల నుండి ఆ డబ్బులకు ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్ల కడగండ్లు మీకు తెలుసా?

గత ఏడు సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు కానీ అధికారంలో ఉన్న తన కుటుంబ సభ్యులు ఒక్క ప్రభుత్వ పాఠశాలను సందర్శించారా?

పాఠశాలల్లో అవసరమయ్యే శుద్ధ ముక్కల ఖర్చులు కూడా సరిగా ఇవ్వట్లేదు. ఉపాధ్యాయ నియామకాలు లేవు పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యాలు లేవు మంచినీటి సౌకర్యం లేదు తరగతి గదికో ఉపాధ్యాయుడు లేడు అసలు తెలంగాణ వచ్చాక ప్రభుత్వ పాఠశాలల బతుకు లేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అని ఈ విషయం ఎవరో కాదు మీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారే స్వయంగా చెప్పారు.

ఒక ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థలో ఒక అంశం మాత్రమే తానే అన్నిటికీ బాధ్యుడు కాడు, ఇన్ని దురవస్థల మధ్య విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను మెచ్చుకోక పోగా ప్రభుత్వ బడుల దీనస్థితికి ఉపాధ్యాయులే కారణం అన్నట్టు మాట్లాడడం మతిలేని మనషుల లక్షణం.

మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న వినోద్ కుమార్ గారు ఈరోజు నమస్తే పత్రిక రకరకాలుగా ఉపాధ్యాయుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు.

ఇదంతా పేదవాడికి విద్యను దూరం చేసే కుట్రలో భాగమే..

 పాఠశాల విద్యనే కాదు ఉన్నత విద్య కూడా తెలంగాణ రాష్ట్రంలో కుదేలై అయిపోయింది.


యూనివర్సిటీల పరిస్థితి  ఇంకా చెప్పనవసరం లేదు. పేదవాడు చదువుకుంటే ప్రశ్నిస్తాడు అని కావచ్చు వీరి భయం.

మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రోత్సహిస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో పెరుగుతున్నవి పోషించబడుచున్నవి డాలర్ల మొక్కలు మాత్రమే.


ఒక కవి రచయిత కళాకారుడు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఒక దేశ భక్తుడు ఒక పోలీస్ ఒక ఉద్యమకారుడు ఒక నక్సలైట్ ఒక సోషలిస్టు ఒక జర్నలిస్టు ఒక క్రీడాకారుడు ఒక కరడు కట్టిన కమ్యూనిస్టు చివరికి మీ దుర్మార్గాలను ఎండగట్టే ప్రతి ధిక్కారస్వరం అందరూ ఈ పేద ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రాణం పోసుకుంటారు.

అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రభుత్వ విద్యను పేదవారికి దూరం చేయాలన్న రాజ్య కుట్రలో భాగమే నేటి నమస్తే తెలంగాణ సంపాదకీయం.

నేడు పదకొండవ పిఆర్సి లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రకటించిన ఫిట్మెంట్ ఎప్పుడో 1974 లో ప్రకటించిన దానికి అటు ఇటు గా లేదా సమానంగా 45 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది.

ఈ పేదవాడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉపాధ్యాయులను ఈ పాఠశాలలను కూడా 50 సంవత్సరాల వెనక్కి నెట్టి వేయాలన్న కుట్ర జరుగుతుంది.

సమయం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయుల మీద విరుచుకు పడుతూనే ఉన్నారు  స్వయంగా నిండు అసెంబ్లీలో ఉపాధ్యాయులకు 54 సంఘాలెందుకు అని ప్రస్తావించారు.  కానీ అందులో  25 సంఘాలు ఉద్యమకాలంలో తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రోత్సహించి పెట్టిచ్చానని మరిచిపోయారు.

దేశంలో 200 పైచిలుకు రాజకీయపార్టీలు ఉండగా మరి మీ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు అని మేం ప్రశ్నించలేదు.

సంఘాలు లేకుండా సభ్యులు లేకుండా ఉద్యమాలు లేకుండా ఉపాధ్యాయులు లేకుండా తెలంగాణ ఆవిర్భవించేదా అది మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నాం.

ఉపాధ్యాయుల మానసిక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ప్రజల్లో పలుచన చేయాలన్న కుతంత్రాలు ఖండిస్తున్నాం.

పెట్టుబడిదారి వ్యవస్థ విష కౌగిలి లో ఉన్న నమస్తే తెలంగాణ యాజమాన్యం ఉద్యోగ ఉపాధ్యాయులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.

అంతవరకు ఆ పత్రికను బహిష్కరిస్తున్నాం.

ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులే కాదు వారికి జీతాలు పెంచడం న్యాయం కాదు అని తన కలాన్ని అమ్ముకొని సరస్వతీ మాతకు అన్యాయం చేసిన స్వప్న భేషరతుగా ఉపాధ్యాయులను క్షమాపణ కోరాలి అని డిమాండ్ చేస్తున్నాం.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను పేదవాడి విద్యను కాపాడుకోవడానికి సమాజములో ప్రతి వ్యక్తి యువకులు ఉద్యోగులు మేధావులు విద్యావంతులు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిలుపునిస్తున్నాం.

ఇలాంటి పిచ్చి రాతలను కూతలను ఖండించాలని కోరుతున్నాం.

జై ఉపాధ్యాయ జై జై ఉపాధ్యాయ.

_*మన్నె చంద్రయ్య*_

_*రాష్ట్ర సహాధ్యక్షులు*_

_*PRTU_తెలంగాణ*_

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు