అశాస్త్రీయ ప్రకటనలపై కేసులు

 మహారాష్ట్ర హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ అద్భుతమైన తీర్పు



టీవీలో వచ్చే అశాస్త్రీయ ప్రకటనలు, వాటిని ప్రచారం చేసే సెలబ్రిటీలు అలాంటి సంస్థల పైన కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మంత్రించిన అష్ట లక్ష్మి యంత్రాలను కొనుగోలు చేసిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పిల్లలు లేని వారికి మా లేహ్యం టీలో కలుపుకొని తాగితే పిల్లలు పుడతారని,
సారాయి తాగే వారికి, బీడీలు తాగే వారికి మేము ఇచ్చిన మందు రెండు బొట్లు వారికి తెలియకుండా అన్నంలో కలిపి పెట్టినట్లయితే మద్యం తాగుడు, సిగరెట్లు, బీడీలు త్రాగడం తక్షణమే మానేస్తారని,
మోకాళ్ళ నొప్పులు గలవాళ్ళు మా మందు పూసుకుంటే గంటలోనే గోడలు దూకేస్తారని,

హనుమాన్ చాలీసా మంత్రించిన మా తాయత్తు మెడకు చుట్టుకునే హనుమంతుని నెత్తిన ఎక్కించుకున్నత్లెనని, అన్నీ శుభాలే జరుగుతాయని,
ఇంకా రంగురాళ్లు, సంఖ్యా శాస్త్రాలు, రుద్రాక్షలు, జ్యోతిష్యం ఇలాంటి వాటి పైన....
ఇవన్నీ అమాయక ప్రజలను దోచుకోవడానికి, ప్రజల్ని మోసగించడానికి, ప్రజల్లొ మూఢనమ్మకాలను పెంచి పోషించడానికి జరుగుతున్న ప్రచారాలే కనుక, వీటిని ప్రసారం చేసే టీవీలు, సెలబ్రిటీల పైన, వస్తువులను అమ్మవారి పైన మూఢనమ్మకాలు నిర్మూలన చట్టం కింద కేసు బుక్ చేయమని చెప్పడం హర్షదాయకం, అభినందనీయం, ఆరోగ్యదాయకం.
మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం పూట ఏ ఛానల్ చూసినా ప్రజల్ని మోసం చేసే ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా రావడం మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. ప్రకటన కర్తలు ప్రకటించిన విధంగా డబ్బులు చెల్లించిన అమాయక ప్రజలు వారి విలువైన ధనాన్ని కోల్పోతూ ఎలాంటి ప్రయోజనం లేక మోసపోతూనే ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా అమలు చేసేలా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 సి. రామరాజు 
రాష్ట్ర కమిటీ సభ్యులు జన విజ్ఞాన వేదిక
 తెలంగాణ 9441967100


వరంగల్ లో తగ్గని ఉద్రిక్తత - బిజెపి వర్సెస్ టిఆర్ఎస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు