ఇప్పుడప్పుడే మార్కెట్ లో కరోనా వాక్సిన్ అందుబాటులోకి రాదన్న కేంద్రం

 


కరోనా వాక్సిన్ తయారు కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా  ఇప్పుడప్పుడే అది మార్కెట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం మొదటి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వాక్సిన్ అంద చేసింది. విడతల వారీగా ప్రాధాన్యత క్రమంలో వాక్సిన్  వివిద రాష్ట్రాలకు సమకూరుస్తారు. అయితే సామాన్యలందరికి వాక్సిన్ అందాలంటే చాలాకాలం పడుతుంది. ఈ విషయంపై కేంద్రం క్లారిటి కూడ ఇచ్చింది.  మార్కెట్ లోకి  వాక్సిన్ విడుదల చేసేందుకు ఇంకా ముహూర్తం ఏది నిర్ణయించ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషన్ ప్రకటించారు.  ప్రైవేట్ మార్కెట్ లో అప్పుడే  వాక్సిన్ విడుదలచేస్తే గందరగోళమే జరుగుుతంది. కరోనా మహమ్మారి సోకిన పేషెంట్లకు చికిత్స కోసం కార్పోరేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇస్తే ఏం జరిగిందే అందరికి తెల్సు. భాదితులను పీల్చి పిప్పి చేసి ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేశాయి.

ఈ క్రమంలో మార్కెట్ లో కరోనా వాక్సిన్ విడుదల చేసేందుకు కేంద్రం సుముఖంగా లేదనే విషయం అర్దం అవుతోంది. కరోనా వాక్సిన్ ఓ ఒక్క ప్రైవేట్ సంస్థకు కూడ అందించే ఆలోచన లేదని ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషన్ తెలిపారు. 

" భారత్ ప్రస్తుతానికి రెండు రకాల టీకాలను ప్రజల వినియోగానికి అనుమతించింది. వీటిని బహిరంగ మార్కెట్లలోకి తీసుకొచ్చే ఆలోచన లేదు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి వచ్చేంత వరకు బహిరంగ మార్కెట్లలోకి కరోనా టీకాను లభ్యం కానివ్వం. ఫలానా సమయంలోగా బహిరంగ మార్కెట్లలోకి తీసుకురావాలని మేమేం నిర్ణయించుకోలేదు. వచ్చే ఏడెనిమిది నెలల్లో దేశంలోని అత్యధిక మంది జనాభాకు కరోనా టీకాను అందివ్వాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్లను ఏ ఒక్క ప్రైవేటు సంస్థకు అందివ్వలేదు" అని భూషన్ ప్రకటించారు.

వాక్సిన్ వచ్చేసిందని సామాన్యులు తొందరపడి ముఖాలకు మాస్కులు తీసి యధేచ్చగా తిరగ వద్దు.మరి కొంత కాలం కాస్త ఓపిక పట్టాలి. కరోనా ను కట్టడి చేసేందుకు కట్టడిగానే ఉండాలి మరి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు