ఇడబ్ల్యు ఎస్ రిజర్వేషన్లతో ఆందోళనకు సిద్దపడుతున్న బీసి, ఎస్టి,ఎస్సి, మైనార్టి సామాజిక వర్గాలు

 



కేంద్రం అగ్రవర్ణాలలో పేదల కోసం  ప్రవేశ పెట్టిన ఎకనామికల్లి వీకర్ సెక్షన్ రిజర్వేషన్లను (ఇడబ్ల్యు ఎస్-EWS) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ పూనుకోవడం పట్ల బిసి,ఎస్సి, ఎస్టి వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

కేంద్రం ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ప్రవేశ పెట్టిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమనిప్రకటించిన సిఎం కెసిఆర్ రెండేళ్ల అనంతరం పరిస్థితులకు తలొగ్గి 10 శాతం ఇడబ్ల్యు ఎస్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం కారణంగా బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

ఇడబ్ల్యు ఎస్ రిజర్వేషన్లు అమలు చేసినందుకు అగ్ర వర్ణ సామాజిక నేతలు సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతించగా మరో వైపు బిసి, ఎస్సి, ఎస్టి,మైనార్టి సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

బిసి, ఎస్సి,ఎస్టి సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వివిద సంఘాలు క్రమంగా తమ నిరసన గొంతు వినిపిస్తున్నాయి. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్య వ్యతిరేకించాడు. 

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఈ వర్గాలు వ్యతిరేకించడం లేదు. కాని వారి జనాభా దామాషాకు మించి 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సి, ఎస్టి, బీసి,మైనార్టీ వర్గాల జనాభా దామాష మేరకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా అట్లా చేయకుండా  కేవలం దేశ జనాభాలో నామమాత్రంగా జనాభా కలిగిన అగ్ర వర్ణాల పేదలకు 10 శాతం రిజ ర్వేషన్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

దేశంలో బిసీల కుల గణన ఇప్పటికి జరగ లేదు.  ఎస్సి, ఎస్టీలకు జనామా దామాష మేరకు రిజర్వేషన్లు పెంచాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో  మొన్నటి వరకు ఇడబ్ల్యు ఎస్ రిజర్వేషన్లు  అమలు చేయబోమంటూ శాసన సభలో సాక్షాత్తు  ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి ఇప్పుడు అమలు చేయ పూనుకోవడం పట్ల  అన్ని వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

తాము అగ్ర వర్మ పేదల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని కాని కేవలం ఒకే ఒక్క శాతం ఉన్న వారి కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏమిటని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ప్రశ్నించారు. 

శనివారం తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో లోకిని రాజు మాట్లాడుతు 12 శాతం వున్న గిరిజనులకు  ఎందుకు రిజర్వేషన్లు పెంచడం లేదో  తెలంగాణ ప్రభుత్వం  గిరిజనులకు  సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 

అగ్రవర్ణాల పేదలపేరు చెప్పి సంపన్నులకు వనరులు దోచిపెట్టే కుట్ర జరుగుతోందని లోకిని రాజు విమర్శించాడు. విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాలలో  అగ్ర వర్ణాల వారి అధిపత్యం కొనసాగుతోందని అన్నారు. 

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సమాయత్తం కావాలని బీసి, ఎస్సి,ఎస్టి, మైనార్టీ వర్గాలకు పిలుపు నిచ్చారు. 

పూలే అంబేద్కర్ ఆశయాల సాదన లో భాగంగా  బీసి, ఎస్సి, ఎస్టి , మైనార్టి వర్గాలు రాజ్యాధికారం దిశగా పోరాటం చేపట్టాలని అన్నారు.

ఇ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ గిరి జనులకు 12 శాతం రిజర్వే,న్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపడతామని త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని లోకిని రాజు ప్రకటించారు.

సమావేశంలో  మహేశ్వర రాజు దనాపురం పురం రఘు, వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ సాయి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు