రామ మందిర నిర్మాణానికి వెల్లువెత్తు తున్న విరాళాలు

మై హోం..మెఘా గ్రూపుల భారి విరాళాలు


 అయోధ్య రామ మందిర నిర్మాణానికి సామాన్యులు మొదలు  సంపన్నుల వరకు  ఎవరికి తోచిన విదంగా వారు విరాళాలు పోగేస్తున్నారు.  విరాళాల సేకరణ పనిలో నిమగ్నమైన  రామజన్మభూమి ట్రస్ట్ భాద్యులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులకు విరాళలు  అంద చేస్తున్నారు.

సామాన్యులు భక్తి భావంతో విరాళాలు ఇస్తే సంపన్నులు ప్రభువులను ప్రసన్నం  చేసుకునేందుకు విరాళాలు అంద చేస్తున్నారు. పలు హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టులు ప్రస్తుతం రామ నామ జపంతో విరాళాల సేకరణ పనిలో ఉన్నాయి.

 తెలంగాణలో విరాళాల సేకరణ ప్రారంభమైన మొదటి రోజే  దాతల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు అందాయి. మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు ఇచ్చారు. అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్ తరపున రూ. 2 కోట్లు రాగా... డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్ లో ఉన్న త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో మైహోమ్ గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రామ్ రావు, జూపల్లి శ్యామ్ రావు విరాళాన్ని ఇచ్చారు. ఆరెస్సెస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి, ఆరెస్సెస్ నేత భాగయ్యకు చెక్కుల రూపంలో విరాళాలను అందజేశారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించింది.

రామ మందిరం కోసం పవన్ సైతం...

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రూ. 30 లక్షలను విరాళంగా ప్రకటించారు. సంబంధిత చెక్కును ఆర్ఎస్ఎస్ ప్రముఖులు భరత్‌జీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం.. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే. పరమత సహనం మనదేశంలో ఉందంటే అది ఆయన చూపిన దారే. అందుకే రామరాజ్యం అన్నారు. అన్ని మతాల వారు, ప్రాణకోటి సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా, పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారు. నా వంతుగా రూ.30 లక్షలు ఇస్తున్నా.” అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యు నేత భరత్ చెక్కును అందించారు పవన్ కళ్యాణ్. ఆయ‌న‌ వ్యక్తిగత సిబ్బంది కూడా రూ.11వేలు ఇచ్చారు. కులాలకు, మతాలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి తన సిబ్బంది ముందుకు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు పవన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు