పొత్తుల పేరుతో కెసిఆర్ కొత్త డ్రామాలు - బండి సంజయ్

కేసీఆర్‌‌‌తో బిజెపి ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదు
కెటిఆర్ సిఎం అయితే అణుబాంబు పేలుతుంది


అసహనంతో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టి మారకుండా ఉండేందుకే  కెసిఆర్ పొత్తుల పేరుతో కొత్త డ్రామాలు అడుతున్నాడని బిజెపి చీఫ్ బండి సంజయ్ విమర్శించాడు. నటనలో కెసిఆరు ను మించిన వారు లేరని కెసిఆర్ ను పెట్టి సినిమా తీస్తే 20 గంటల్లో సినిమా పూర్తి అవుతుందని అన్నారు.

శుక్రవారం వరంగల్ నగరంలో పర్యటించిన బండి సంజయ్  మీడియాతో మాట్లాడారు.  కెసిఆర్ బిజెపితో పొత్తు పెట్టకుంటారని వచ్చిన వార్తల నేపద్యంలో  మీడియా అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ స్పందించారు. దమ్ముంటే కేసీఆర్ నాతో ఢిల్లీకి రావాలి. పొత్తులపై ఎవరు హామీ ఇచ్చారో తేలుస్తా నని అన్నారు.  కేటీఆర్‌‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని  రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్‌‌‌తో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ స్పష్టం చేసారు. కెటిఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఆటం బాంబు కాదు అణు బాంబు పేలు తుందన్నారు.

కెటీఆర్ ను సీఎంను చేసే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్.. ఫామ్ హౌస్‌‌లో దోష నివారణ పూజలు చేశారన్నారు. హోమ ద్రవ్యాలను త్రివేణి సంగమంలో కలపడం కోసమే కాళేశ్వరం వెళ్లారని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనుక అసలు రహస్యం శనిపూజ కోసమేనన్నారు.

బండి సంజయ్ ని సత్కరించిన పార్టి నేతలు 

తెలంగాణ  రాష్ట్రంలో ఇబిసి రిజర్వేషన్లు అమలు అయ్యేలా వత్తిడి తెచ్చిన బిజెపి చీఫ్ బండి సంజయ్ ను శుక్రవారం వరంగల్ లో పార్టి నేతలు సన్మానం చేసారు. అంతకు ముందు హన్మకొండ లోని తెలంగాణ అమర వీరుల స్థూపం వద్దం ప్రధాన మంత్రి నరేంద్ర మోది పటానికి పాలభి షేకం చేశారు. అనంతరం హరిత కాకతీయ హోటెల్ లో బండి సంజయ్ ను సత్కరించారు. విశాల ధృక్పదంతోనే మోది అగ్ర వర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. రెండేళ్ల కాలయాపన కారణంగా  రాష్ట్రంలో అగ్ర వర్ణ పేదలు  నష్ట పోయారని అన్నారు. ఆలస్యంగా నైనా తెలంగాణ రాష్ట్రంలో  అగ్ర వర్ణాలలో ఇబిసీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు