రాముడు భారతదేశంలో పుట్టాడో.. నేపాల్‌లో పుట్టాడో.. జర్మనీలో పుట్టాడో తేలాలి

 టిఆర్ఎస్ నేత ఎస్సి కార్పోరేషన్ మాజి చైర్మన్ పిడమర్తి రవి


అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేత ఎస్సి కార్పోరేషన్ మాజి చైర్మన్ పిడమర్తి రవి రాముడి పై చేసిన వ్యాఖ్యలు  విమర్శలకు దారి తీసాయి.

కరీంనగర్ లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన  రాజ్యాంగ రక్షణ సదస్సు లో  పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ మందిర్ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టి చేపట్టి విరాళాల సేరకరణపై కూడ విమర్శలు చేశారు.

"నిన్నమొన్నటి నుంచి చందాల దందా మొదలైంది.. అయోధ్య రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు.. రానున్న రోజుల్లో జై భీమ్‌ –జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుంది" అని అన్నారు.‘అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదు, ఇటీవల నేపాల్‌ ప్రధాని.. రాముడు తమ దగ్గరే జన్మించాడని అన్నారు. అసలు రాముడు భారతదేశంలో పుట్టాడా.. నేపాల్‌లో పుట్టాడా.. జర్మనీలో పుట్టాడో తేలాల్సి ఉంది’ అని పిడమర్తి రవి అన్నారు. బీజెపి చీఫ్  బండి సంజయ్  ప్రజా సమస్లపై మాట్లాడటం పక్కన పెట్టి నిత్యం గుళ్ళు గోపురాల పేరిట టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నాడని అన్నారు. ళితులు హిందువులే అయితే ఆలయాల్లోకి ప్రవేశం ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. పిడమర్తి రవి వ్యాఖ్యలకు వేదికపై నున్న బీజేపీ నాయకుడు ఎస్‌. అజయ్‌ వర్మ అభ్యంతరం వ్యక్తం చేసాడు. బండి సంజయ్ పై విమర్శలు చేయడం సరికాదని ఇది రాజకీయ వేదిక కాదని అన్నారు. సదస్సు  నిర్వాహకులు కలుగు చేసుకుని శాంతింప చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు