హన్మకొండలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

 


హన్మకొండలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి


పూలే ఆదర్శంగా చట్టసభల్లో బి.సి వాటా సాధించాలి


ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్


     అణగారిన వర్గాల పక్షపాతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని చట్టసభల్లో బి.సి వాటా సాధన ఉద్యమం చేయాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కేంద్రం మహాత్మా జ్యోతిరావు పూలే కాలనీలో జ్యోతిరావు పూలే కాలనీ అద్యక్షులు బాలరాజు అధ్యక్షతన జరిగిన పూలే 197 వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయా కాలాల్లో ఎన్నో త్యాగాపూరిత ఉద్యమాలు చేసిన పూలే లాంటి మహనీయులు ఎన్నో హక్కులు సాధించిపెట్టారని, శూద్రుల అజ్ఞానం, అసమానతలకు అవిద్య కారణమని అణగారిన ప్రజలకు, స్త్రీలకు విద్య నేర్పించి ఎన్నో హక్కులు సాధించిపెట్టారని అన్నారు. మహనీయులు సాధించిపెట్టిన హక్కులను కాపాడుకోవడంతో పాటు సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలంటే చట్టసభల్లో బి.సి లకు వాటా సాధన ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. చట్టసభల్లో వాటా కోసం దేశంలోని సంఘాలన్నీ ఏకమై దేశవ్యాప్త ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. సమాన విద్య, సమసమాజ స్థాపన జరిగిన నాడే పూలే లాంటి మహనీయుల పోరాటానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. 

   


 ఈ కార్యక్రమంలో తెలంగాణ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి కొంగ వీరాస్వామి, నాయకులు చింతకింది కుమారస్వామి, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఛాపర్తి కుమార్ గాడ్గే లు పాల్గొని మాట్లాడారు. జ్యోతిరావు పూలే వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి తిరుపతి, సంయుక్త కార్యదర్శి పల్లం శ్రీకాంత్, కోశాధికారి సాయిని నరసింహయ్య, అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ, దేవులపల్లి సదానందం, సూర్యనారాయణ, నాగరాజు, శ్రీనాథ్, ఐలేష్, చక్రపాణి, పల్లం మల్లికార్జున్, వెంకట్ రెడ్డి, వెంకన్న, బరిగల మల్లికార్జున్, భాస్కర్ రెడ్డి, సిరంగి రమేష్, దుంపేటి రమేష్,  ఉస్మాన్ పాషా, కంజుల సురేష్, బండి రజనీకాంత్, పోషాలు, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


కాకతీయ యూనివర్సిటీలో


కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం వద్ద పూలే దంపతులకు పూలమాలలు వేసి పూలే ఆశయాలు సాధిస్తామని, పూలే స్పూర్తితో చట్టసభల్లో బి.సి లకు వాటా సాధించాలని పలువురు నినాదాలిచ్చారు. 

   ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ టి రమేష్, జ్యోతిరావు పూలే స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ ఆకుతోట శ్రీనివాస్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సంగాని మల్లేశ్వర్, కొంగ వీరాస్వామి, తిరునహరి శేషు, మంద వీరాస్వామి, విశ్రాంత ప్రొఫెసర్లు కూరపాటి వెంకటనారాయణ, వడ్డే రవీందర్, ఆదర్శ న్యాయ కళాశాల చైర్మన్ బూర విద్యాసాగర్, వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, వివిధ సంఘాల నాయకులు సాయిని నరేందర్, చింతకింది కుమారస్వామి, చాపర్తి కుమార్ గాడ్గే, గాండ్ల స్రవంతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ లో



     వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ అధ్యక్షతన వరంగల్, హన్మకొండ జిల్లాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పూలే జయంతి కార్యక్రమంలో  హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాతంగి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి లడే రమేష్, సంయుక్త కార్యదర్శి జంగా స్వప్న, వరంగల్ బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు హరిబాబు, గోపికరాణి, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్స జనార్ధన్, జయాకర్, సీనియర్ న్యాయవాదులు చిల్ల రాజేంద్రప్రసాద్, దయాల సుధాకర్, అల్లం నాగరాజు, కూనూరు రంజిత్ గౌడ్, సాయిని నరేందర్, విద్యాసాగర్ రెడ్డి లు పూలే గొప్పదనం గూర్చి సందేశమిచ్చారు. పూలే లాంటి మహనీయులు అందించిన జ్ఞానం, ఉద్యమ స్ఫూర్తితో అణగారిన వర్గాల వారికి, స్త్రీలకు మరిన్ని హక్కులు సాధించుకుని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

   ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గునిగంటి శ్రీనివాస్, శామంతుల శ్రీనివాస్, చింత నిఖిల్ కుమార్, వేముల రమేష్, శివ, అరుణ, గురిమిల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు