రక్తం మరిగి -రగిలింది విప్లవాగ్ని

 


రక్తం మరిగి-

రగిలింది విప్లవాగ్ని...

_______________

_జలియన్వాలాబాగ్_

_మారణహోమం జరిగిన రోజు_

       13.04.1919

_____________________


_ఎలిశెట్టి సురేష్ కుమార్_

      9948546286


*_జలియనువాలాబాగున_* 

*_జరిగిన మారణకాండ_*

*_తలచి ఎగురవేశాడు_*

*_తిరుగుబాటు జెండా.._*

భారత స్వాతంత్ర సంగ్రామానికి 

ఆ హోమమే ధూపం..

నడిపించిన దీపం!

ఎందరో వీరుల రక్తాన్ని

మరిగించిన దుశ్చర్య..

కట్టలు తెగిన ఆవేశమై..

మహోగ్ర సన్నివేశమై..

*_ఉరకలెత్తాడు భగత్ సింగ్.._*

*_ఉరిమిలేచాడు అల్లూరి!_*


అది చరిత్ర ఎరుగని ప్రళయం

ఏ ధరిత్రి చూడని విలయం

ప్రతి భారతీయుని 

అధరం రుధిరమై..

కదం తొక్కిన విప్లవమై..

ఉరకలెత్తింది స్వరాజ్యకాంక్ష

*_ఈ దేశం నుంచి_* 

*_చివరి తెల్లోడినీ_* 

*_తరిమెయ్యాలన్న ఆకాంక్ష..!_*


*జలియన్వాలాబాగ్..*

ఆ చల్లని నేల

ఏం తప్పు చేసిందని..

భరతజాతి పరపీడన

నుంచి విముక్తం కావాలని

కోరుకునే జనం..

పిల్లలు..తల్లులు..

అక్కడ చేరితే ఆశ్రయం ఇచ్చిన పాపానికి

చరిత్రలో అతి భయానక

మారణహోమానికి సాక్షిగా

రక్తంతో తడిసి..

గుండె పగిలేలా వగచిందే

*_అక్కడ నేల తల్లి.._*

*_తన బిడ్డల శవాల గుట్టల_*

*_నడుమ పొర్లి పొర్లి..!_*


అమృతసర్లోని బాగ్..

రౌలత్ చట్టంపై చర్చ..

అలా వచ్చిన డయ్యర్

ఇలా కాల్పులు జరిపేసాడు

హెచ్చరికలు లేకుండా..

ఉచ్చనీచాలు ఎంచకుండా..

మూకలను చెదరగొట్టడానికి రాలేదని..

ఆ ఆలోచనే తనకు లేదని 

చంపడానికే వచ్చానని చెప్పుకున్న తుచ్చుడు మేచ్చులకన్న నికృష్టుడు..

వదిలేస్తే తనను 

అపహాస్యం చేస్తారని ముందే 

పొడుచుకొచ్చిన రోషం..

ఆవిష్కరించింది అమానుషం.. 

మానవత మరచి..

సిగ్గు విడిచి..

విరిచాడు రొమ్ము..

మానవ రూపంలోని

రాక్షసుడతడు..

*_నెత్తుటి కొలనులో_*

*_జలకమాడే క్రూరమృగం.._*

*_నరమాంసపు రుచి మరిగిన_*

*_తెల్ల కోరల గ్రామసింగం..!_*


మెషిన్ గన్నులు

సందుల్లో దూరలేదని..

అందుకే మామూలు రైఫిల్స్ వాడానని డయ్యర్ వాంగ్మూలం..

మరింత కలకలం..

ఊరినే ఊరికే 

మట్టుపెట్టేద్దునని 

అతగాడి పరితాపం..

కనిపించని పశ్చాత్తాపం..

రవీంద్రునికే తెప్పించి కోపం

తిరిగి ఇచ్చేసి సర్ పటాటోపం

ఆనాటి డయ్యర్ దురంతమే

తెల్లోడి పాలన 

అంతానికి సంకేతమై..

_*రగిలింది విప్లవాగ్ని..*_

_*జలియనువాలాబాగు*_

*_రక్తపుటేరుల తిలకంతో.._*

*_శవాల గుట్టలు_*

*_రగిలించిన పూనకంతో..!_*

_______________________

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు