వైనాట్..పురంధేశ్వరి..!


 వైనాట్..పురంధేశ్వరి..!


ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం బిజెపికి దక్కింది.

తెలుగుదేశం..జనసేన..

భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కమలానికి కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. 

పివిజి రాజు..

ఆనందగజపతి రాజు..

ఘనత వహించిన పూసపాటి

కుటుంబం నుంచి 

ఇద్దరు(అశోక్ గజపతిరాజుతో కలిపి ముగ్గురు)

ప్రాతినిధ్యం 

వహించిన స్థానం..

ఆపై బొత్స దంపతులు.. 

అంతకుముందు కొండపల్లి పైడితల్లి నాయుడు..

ఇంకా ముందుకు వెళ్తే 

కర్రి నారాయణరావు..

కెంబూరు

రామ్మోహనరావు..


నిజానికి వీరంతా బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయకులు.. డీలిమిటేషన్ 

అనంతరం విజయనగరం లోకసభ స్థానం ఏర్పడిన తర్వాత మొదటగా బొత్స ఝాన్సీలక్ష్మి ఎంపిగా గెలిచారు.ఆమె తర్వాత అశోక్ గజపతి 2014 లో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై మోడీ మంత్రివర్గంలో

మంత్రిగా పని చేశారు.మొన్న 2019 లో అనూహ్యంగా బెల్లాన చంద్రశేఖర్ వైసిపి ప్రభంజనంలో అశోక్ పై గెలిచి ప్రస్తుతం విజయనగరం ఎంపిగా ఉన్నారు.ఇది చరిత్ర..!


ఇప్పుడు ఏంటి..

వాస్తవానికి ఈ ఎన్నికల్లో విజయనగరం స్థానం నుంచి పోటీ చెయ్యడానికి ప్రధాన ప్రత్యర్ధ పార్టీలు రెండింటి నుంచి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడం విడ్డూరం. ఇటు వైసిపి నుంచి ప్రస్తుత ఎంపి బెల్లాన..

అటు తెలుగుదేశం నుంచి మాజీ ఎంపి అశోక్ ససేమిరా అన్నారు.కాగా బిజెపి..టిడిపి  అవగాహనలో విజయనగరం స్థానం కమలం పార్టీకి వెళ్ళింది.ఇప్పుడు ఇక్కడ

అభ్యర్ధిని బరిలోకి దింపే బాధ్యత కమలనాథులదే.

వైసిపి బెల్లాననే ఒప్పించి మళ్లీ రంగంలోకి దింపుతుందేమో..!.


మరి బిజెపి సంగతేంటి..

రాజ్యసభ సభ్యుడు జివీఎల్ నరసింహారావు విజయనగరం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే ఆయనకు ఈ జిల్లాలో పరిచయాలు తక్కువ.బిజెపి బలం కూడా అంతంత మాత్రమే.జిల్లాలో బిజెపి నాయకులుగా గుర్తింపు పొందిన రెడ్డి పావని..పాకలపాటి సన్యాసిరాజు..కుసుమంచి సుబ్బారావు వంటి నాయకులకి అంత 

సీన్ లేదు.. 

మరి ఎవరు..!?


పురంధేశ్వరి అభ్యర్థి అయితే..

బిజెపిలో జాతీయ స్థాయి నాయకురాలిగా..

మాజీ కేంద్రమంత్రిగా.. మీదుమిక్కిలి ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి

ఏ ప్రాంతంలోనైనా పలుకుబడి ఉంటుంది.

పైగా ఆమె పొరుగునే ఉన్న విశాఖ ఎంపిగా గతంలో సేవ చేసి విజయనగరం జిల్లాలో కూడా పరిచయాలు ఏర్పరచుకున్నారు.


ఒకరకంగా చెప్పాలంటే 

పురంధేశ్వరి అభ్యర్థి అయితే

తెలుగుదేశం క్యాడర్ నుంచి కూడా చిత్తశుద్ధితో సహాయ సహకారాలు లభిస్తాయి. మరోరకంగా చూస్తే ఎన్టీఆర్ కూతురు అభ్యర్థిగా ఉంటే

ఆ ప్రభావం అసెంబ్లీ స్థానాలపై కూడా ఉండి

తెలుగుదేశం..జనసేన అభ్యర్థుల విజయావకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది.

మరి కమలనాధులు ఏం ఆలోచిస్తున్నారో..చంద్రబాబు 

ఎలాంటి చొరవ తీసుకుంటారో చూడాలి.!


ముక్తాయింపు..

నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆస్థానంలో పలుకుబడి కలిగిన వ్యక్తి పురంధేశ్వరి..

ఈసారి కూడా కేంద్రంలో బిజెపి కూటమి అధికారంలోకి వస్తే..

పురంధేశ్వరి విజయనగరం 

ఎంపిగా ఉంటే..

ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు

ఎక్కువగా ఉంటాయనేది

పరిశీలకుల అభిప్రాయం.!


    సురేష్..జర్నలిస్ట్

         9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు