ఉచిత విద్యుత్ పై ప్రబుత్వం కీలక ప్రకటన- 200 యూనిట్ల వరకు వాడుకునే తెల్లకార్డు దారులందరూ అర్హులే

 

తెల్ల రేషన్ కార్డుదారులందరికి ఉచిత కరెంట్
200 యూనిట్ల వరకు వాడుకునే వారికి మాత్రమే
జీరో బిల్లులు రాక పోయినా అప్లై చేసుకుంటే మాఫి
ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రకటన


గృహజ్యోతి పథకం కింద పేదలకు ఉచిత విద్యుత్ పథకం పై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు కీలక ప్రకటన చేశారు. జీరో బిల్లులు రాక పోయినా అర్హత కలిగిన వారు మున్సిపల్, లేదా మండల కార్యాలయాలు, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలలో దరఖాస్తు చేస్తే మాఫి చేస్తారని తలిపారు. ఉచిత విద్యుత్ పథకం విషయంలో స్పష్టత ఇస్తూ 200 యూనిట్ల వరకు బిల్లులు వచ్చినవారికే ఈ పథకం వర్తింస్తుందని తెల్లరేషన్ కార్డు దారులు మాత్రమే అర్హులని అన్నారు. 200 యూనిట్లకు పైగా వాడుకునేవారికి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్నా మాఫి వర్తించదని అన్నారు. తెల్లకారుడు లేని అర్హులైన పేద వారికి గృహజ్యోతి పథకం ఎట్లా వర్తింపచేయాలో అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 40,33,702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. మార్చి ఒకటవ తేది నుండి ఉచిత బిల్లులు జారి అవుతున్నాయి. చాలా మందికి ఇంకా జీరో బిల్లులు రాలేదన్ని ఫిర్యాదులు అందాయి. దాంతో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.


తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. ఈనెల 1 నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ జీరో బిల్లులు తీస్తున్నాయి. అయితే చాలా మందికి 200 యూనిట్లలోపు కరెంట్ వాడినా వారికి జీరో బిల్లులు రాలేదు. పథకానికి అన్ని అర్హతలు ఉన్నా.. జీరో బిల్లులు జారీ కాలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి 200 యూనిట్లలోపు కరెంటు వాడుకున్నట్లు ఈ నెలలో బిల్లు జారీ అయితే అది చెల్లించకుండా వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 40,33,702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు.

జీరో బిల్లులు రాని వారి కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని తెల్లరేషన్ కార్డు, ఆధార్, కరెంట్ మీటర్ నెంబర్ వివరాలతో ధరకాస్తు చేసుకుంటే అర్హతలు పరిశీలించి మాఫి చేస్తారని తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు