బలగం కాకమ్మ కథ...రంగమార్తాండ డ్రామా లేని హై డ్రామా ..!

రంగమార్తాండ రంగేంటి..?

బలగం బలమెంత..!?

బలగం..రంగమార్తాండ..






ఇటీవలి కాలంలో most talked about movies..

వసూళ్లు..బాక్సాఫీస్ రికార్డులు..సూపర్ హిట్ పాటలు..ఈ రెండు సినిమాలకు సంబంధించి 

ఈ అంశాలను గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.ఈ సినిమాల్లో ఏముంది..క్వాలిటీ ఏంటి..

నటీనటుల అభినయం 

ఏ స్థాయిలో ఆకట్టుకుంది.


బలగంలో ఇవి కూడా పెద్ద ప్లస్ పాయింట్లు కావు.ఎందుకంటే బలగంలో ఒకరిద్దరు మినహా గుర్తింపు పొందిన నటులే లేరు.మిగిలిన వారు కూడా పెద్ద పెర్ఫార్మెన్సు ఇచ్చిన సీన్ లేదు.ఇక రంగమార్తాండలో

ఉద్దండులైన నటులు ముగ్గురున్నారు.టైటిల్ రోల్ పోషించిన ప్రకాష్ రాజ్..

అంతే ప్రాధాన్యత ఉన్న పాత్ర వేసిన బ్రహ్మానందం..శివగామి 

రమ్యకృష్ణ..ఈ ముగ్గురిలో 

ప్రకాష్ రాజ్ ..బ్రహ్మానందం పాత్రలపరంగా స్టేజి ఆర్టిస్టులు గనక ఎక్కువ నటించాలేమో అన్నట్టు 

కొన్ని సన్నివేశాల్లో 

ఓవర్ యాక్షన్ చేశారు.

ఇప్పుడు ఆ అంశాన్ని కూడా ప్రస్తావించడం లేదు.

ఇక్కడ ప్రధాన అంశం 

ఆ సినిమాలు నిజంగా అంత గొప్పవా అన్నదే..!


నిజానికి ఆ రెండు సినిమాలు 

అంత గొప్పగా మాటాడుకోవాల్సినంతవి ఏమీ కాదు.బలగం సినిమా ఆద్యంతం పేలవమైన సన్నివేశాలతో నడిచింది.పెద్దగా ప్రాధాన్యత లేని ఒక్క పాయింటును పట్టుకుని దాని చుట్టూ మానవ సంబంధాలు అనే 

అంశాన్ని బలవంతంగా చుట్టి

సినిమా నడిపాడు కొత్త దర్శకుడు వేణు.


అలాగే రంగమార్తాండ..ఇది కూడా కుటుంబ సంబంధాలు అనే అంశం చుట్టూ అల్లిన కథే.అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఇలాంటి సినిమాలు గతంలో తెలుగులో చాలా వచ్చాయి.

కుటుంబ బంధాలు.. అన్నదమ్ములు..తండ్రీ కొడుకుల అనుబంధాలు ఇతివృత్తంగా ఎన్నో గొప్ప సినిమాలు చూసాం.

మహానటుల అభినయాలూ కన్నాం.

ఉమ్మడికుటుంబం..

ఆదర్శకుటుంబం.. 

బడిపంతులు...

ఉండమ్మా బొట్టుపెడతా..

పండంటి కాపురం.. 

బహుదూరపు బాటసారి..

ఓ తండ్రి తీర్పు..

అమ్మ రాజీనామా..

ఇలా ఒక పెద్ద పరంపర..

వీటిలో ఆయా కుటుంబాల కథలు ఎలా నడిచినా ప్రధాన ఇతివృత్తాలు మాత్రం ఒకటే

సంబంధాలు..అనుబంధాలు.

పిల్లలు తల్లిదండ్రులను సరిగ్గా చూడని కథాంశాలు..

వాటిలో గుండెల్ని పిండేసే ఎన్నో సన్నివేశాలు..

ఎస్వీఆర్..గుమ్మడి..

నాగయ్య..ఎన్టీఆర్..

ఎయెన్నార్..కృష్ణ..శోభన్..

కృష్ణంరాజు..మురళీమోహన్,సావిత్రి..అంజలీదేవి వంటి 

మహానటుల అభినయాలు..

బరువైన పాత్రలు..

చక్కటి పాటలు..

వీటన్నిటి కలగలుపు 

ఆయా సినిమాలు.. 

అలా మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.


వాటిని మించి బలగం.. రంగమార్తాండ సినిమాల్లో ఏమీ లేదు.పైగా ఈ రెండు సినిమాల్లో తాగుడు కూడా ప్రధాన అంశంగా చేర్చారు.

తెలంగాణ ప్రజల జీవితాల్లో

మద్యపానమనేది ప్రధానమని..అది లేకపోతే అక్కడ రోజు గడవదన్నట్టు చూపించాడు దర్శకుడు.

పిండాలను కాకి ముట్టడమనేది హిందూ కుటుంబాల్లో ఒక సెంటిమెంట్.అయితే కథ మొత్తం దాని చుట్టూ నడిపేయడం అంత సహేతుకం అనిపించలేదు.

పూర్వం ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఆయా కుటుంబాలు ముందులో ఎంత ఆనందంగా ఉండేవో చూపించి మధ్యలో ఏవో కారణాల వల్ల ఎలా విడిపోయాయో చాలా బలమైన సన్నివేశాల ప్రాతిపదికగా చూపించేవారు.

అందుకే అవి అంతగా పండేవి. బలగంలో ఆ కుటుంబం ఎప్పుడూ బలమైన బంధంతో సాగిన దాఖలాలు కనిపించలేదు.

చివర్లో ఒక్కసారిగా కలసిపోడానికి అవసరమైన 

దృష్టాంతాలు కూడా ఎక్కడా గోచరించలేదు.కొత్త దర్శకుడు 

కనక అని సరిపెట్టుకోవచ్చు!


ఇక కృష్ణవంశీ అంతటి పెద్ద దర్శకుడు తీసిన సినిమా రంగమార్తాండ..ప్రధాన క్యారెక్టర్లు నాటక రంగానికి చెందిన దిగ్గజాలు.అయితే తాగడమే పనిగా పెట్టుకున్న వ్యక్తులుగా తెరపై కనిపిస్తారు.ఇది కళాకారులపై

చిన్న చూపు ఏర్పరిచే విధంగా ఉంది.ఇక సన్నివేశాలు అంత బలంగా అనిపించలేదు.ఈరోజుల్లో తల్లిదండ్రులు ఎంత మంచి వారైనా గాని పిల్లలకు ముందే ఆస్తిపాస్తులు రాసి అనాధల్లా మిగిలిపోతున్న ఉదంతాలు లేవు.ఒకవేళ ముందుగా రాసినా జీవిత కాలంలో వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.సినిమాలో ప్రకాష్ రాజ్  పై సానుభూతి ఏర్పడే విధంగా సన్నివేశాలు లేవు.

అంతటి గొప్ప నటుడి (సినిమాలో) ప్రవర్తన హుందాగా లేదు.


స్నేహితుడి విషయంలో

రంగమార్తాండ ప్రవర్తన

అస్సలు సంబద్ధంగా లేదు.

స్నేహితుడు భయం వేస్తుందిరా..అని మొర పెట్టుకున్నా వదిలేసి వెళ్లిపోవడం చిత్రంగా అనిపించింది.నిజమే..తాను కూతురి ఇంట్లో ఉండగా తీసుకువెళ్ళలేకపోవచ్చు .

కాని తనకు తోడుగా మిత్రుడి ఇంట్లోనే ఉండలేని వ్యక్తి కాడు.కాని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు.

పరాకాష్టగా ప్రాణమిత్రున్ని చంపేయడం..

మెర్సీ కిల్లింగ్ కాదది..

తన సొంత క్వారెక్టర్ అసాసినేషన్..!

చంపేయడమే గాక అనాధగా ఉన్న మిత్రుడి శవాన్ని కూడా అనాధప్రేతంగా వదిలి వచ్చేయడం.ఇంట్లో పిల్లాడు మరణానికి దగ్గరగా ఉంటే బాబూ వినరా అన్నాదమ్ముల

కథ ఒకటి వినిపించి పిల్లాడు చనిపోయాక తానే స్వయంగా గొయ్యి తీసి పాతి పెట్టిన ఇంటి పెద్ద ఎస్వీఆర్

ముందు రంగమార్తాండ ఎంత చిన్నబోయాడో..

సరే..పోలికలు తెస్తే పొలికేకలు వేయాల్సిందే..!..


మొత్తానికి రంగమార్తాండ..

బలగం..ఈ రెంటి గురించి ఏమైనా చెప్పాలంటే

ప్యాక్షన్ సినిమాల ఒరవడిలో..మితిమీరిన హీరోయిజంతో నిండిన 

మూస కథల పరంపరలో

వచ్చిన సినిమాలు ఇవి ఒక చేంజ్..అంతే తప్ప..

కళాఖండాలు..కలకండలు

కానే కావు..!


         సురేష్ కుమార్ e

              9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు