కెసిఆర్ దెబ్బకు దిగొచ్చిన కేంద్రం - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి


వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి ప్రైవేటీకరణ విషయంలో  తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు దెబ్బకు కేంద్రం దిగివచ్చిందని ఆ పార్టి నేతలు ఆనందం వ్యక్తం చేసారు

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించడమే కాక బిడ్డింగ్ వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయించారు

బిడ్డింగ్ లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర అధికారుల బృందం వైజాగా స్టీల్ ఫ్యాక్టరీని కూడ సందర్శించింది

దాంతో కేంద్రం ప్రైవేటీకరణపై మాట మార్చింది

కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి కీలక ప్రకటన చేసారు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని అన్నారు

అర్ఎన్ఐఎల్
ను బలోపేతం చేస్తామని తెలిపారు  

యాజమాన్యంతో సమావేశం జరిపి పరిస్థితులపై చర్చించారు

స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేసేందుకు కొత్తగా అవసరమైన విభాగాలు ఏర్పాటు చేస్తామని ముడి సరుకు సరఫరా మెరుగు పరుస్తామని అన్నారు

అయితే బిడ్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని  మంత్రి ఫగ్గన్ సింగ్ ఓ ఎత్తుగడగా అభివర్ణించారు

స్టీల్ ఫ్యాక్టరి ప్రైవేటీకరణ విషయంలో  కేంద్రం వెనక్కి తగ్గడం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగడమే కారణమని మంత్రికెటిఆర్ పేర్కొన్నారు

విశాఖఉక్కుఫ్యాక్టరీని ఎట్లా విక్రయిస్తారో చూస్తామని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికతోనే కేంద్రం దిగివచ్చిందని కెసిఆర్ ఏ పని మొదలు పెట్టినా  దెబ్బ ఇట్లా ఉంటదని మంత్రి పేర్కొన్నారు

సిబిఐ మాజి డైరెక్టర్ వి.వి లక్ష్మి నారాయణ కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు

తెలంగాణ ప్రభుత్వం ఓ బృందాన్ని పంపి స్టీల్ ఇవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకోవడం వల్ల కేంద్రం ప్రైవేటీకరణకు వెళ్లకూడదని నిర్ణయిచిందని పేర్కొన్నారు

విశాఖ ఉక్కు ప్ర‌ైవేటీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటంతోనే కేంద్రం దిగివ‌చ్చింద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో కేంద్రంపై పోరు కొన‌సాగిస్తా మన్నారు

 ఈ విజయం కేసీఆర్ కు ఎపి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి  విశాఖ కార్మికులకు దక్కుతుందని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కృషి వల్లే కేంద్రం దిగివచ్చి ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించికుందని బిఆర్ఎస్ పార్టి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ అన్నారు

ఎపి ప్రజల పోటారాటానికి అండగా నిలిచిన కెసిఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు