పంటలు నష్ట పోయిన రైతులకు పరిహారం ప్రకటించిన సిఎం కెసిఆర్

 






వడగండ్ల వర్షాలకు పంటలు దెబ్బతిన్న గ్రామాలలో ముఖ్యమంత్రి కేసియార్ సుడిగాలి పర్యటన చేసారు.

ముఖ్యమంత్రి వెంట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, 

గంగుల కమాలాకర్, రైతు భందు అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

 వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందన్ రావు తో పాటు

ఆయా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు

ఖమ్మం, మహబూబాబాద్,వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడారు.



హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో నేరుగా ఖమ్మం జిల్లా బొనకల్లు మండలం రామాపురం గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి 

అక్కడి పరిసర గ్రామాలలో పంటల నష్టం పరిశీలించారు

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో పర్యటించి పంటలు నష్ట పోయిన రైతులతో మాట్లాడారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామం సందర్శించి రైతులతో మాట్లాడారు

అనంతరం కరీంనగరర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు

పర్యటనలో క్షణం తీరిక లేకుండా గడిపిన సిఎం మద్యాహ్నభోజనానికి సమయం లేక పోవడంతో ప్రయాణంలోనే బస్సులోనే  మంత్రులు,అధికారులతో కల్సి  భోజనాలు చేశారు. 

మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు అందరికి స్వయంగా వడ్డించారు.

పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరాకు పది వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీయార్

హైదరాబాద్ నుండే నేరుగా పంటల నష్ట పరిహారం ప్రకటించవచ్చని కాని రైతులతో మాట్లాడి స్వయంగా ఓదార్చాలని వచ్చామని సిఎం కెసిఆర్ తెలిపారు

కౌలురైతులను కూడ ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు.

రైతులు పొందే పరిహారంలో ఎంతో కొంత కౌలు రైతులు పొందే విదంగా చూడాలన్నారు

రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నది దేశంలో కేవలం తెలంగాణ రాష్ర్టమేనని అన్నారు

రైతులకు 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.

వ్యవసాయం ద్వారా జిడిపి వృద్ది ఉంటుందని తెలంగాణ లో రుజువు చేసామని అన్నారు

రాష్ర్టంలో 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయని తెలిపారు

మక్కజొన్న, మిర్చి పంటలతో పాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు

పంటలు నష్ట పోయిన రైతులు ఆందోళన చెందవద్దని అన్ని విధాలా ఆదుకుంటామని 

ప్రబుత్వం ఇచ్చేది సహాయం కాదని పునరావసమని ఈఎం కేసీయార్  అన్నారు



వీడియో లింకు కోసం క్లిక్ చేయండి





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు