పేపర్ లీక్ భాద్యులను ప్రాసిక్యూట్ చేయాలి ----- గవర్నర్ కు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

 మంత్రి కెటిఆర్ చైర్మన్ జానార్దన్ రెడ్డి అనితా రామంచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయాలి ----- గవర్నర్ కు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ కుంభకోణంలో మంత్రి కెటిఆర్, చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రెటరి అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయాలని కాంగ్రేస్ పార్టి అద్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం గవర్నర్ ను కల్సి ఫిర్యాదు చేసారు.

వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ గవర్నర్ కు ఏ సెక్టన్ మేరకు ప్రాసిక్యూట్ చేసే  అధికారాలు  ఉన్నాయో పేర్కొన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.  తమ ఫిర్యాదు పై  గవర్నర్ పాజిటివ్ గా స్పందించారని  టీఎస్పీఎస్సీ  ఘటన చాలా పెద్దదని  సీరియస్‌గా తీసుకుంటా మని గవర్నర్ చెప్పారని అన్నారు.పేపర్ లీకేజి కారణంగా లషలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్య గోచరంగా రోజులుగా మారిందన్నారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ ఆయన శాఖ ఉద్యోగులదే కీలకపాత్రని ఆరోపించారు. కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్  సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం సరైన రీతిలో పేపర్ లీక్ కుంభకోణంపై స్పందించి లేదన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు