చర్లపల్లి జైళుకు తీన్మార్ మల్లన్న

 


తీన్మార్ మల్లన్నను పోలీసులు బుధవారం చర్లపల్లికి జైళుకు తరలించారు. హయత్ నగర్ మునగనూరులోని మెజిస్టేట్ ముందు తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురుని మేడిపల్లి పోలీసులు హాజరుపర్చగా... వారికి 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

 పలు అభియోగాలపై  తీన్మార్ మల్లన్నతో  పాటు జర్నలిస్ట్ తెలంగాణ విఠ్టల్ మరి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి ఆచూకి తెలుపక పోవడంతో వివిద రాజకీయ పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తదితరులు మల్లన్న  ఆరెస్టును ఖండించారు. మల్లన్న  భార్య మమత మేడిపల్లి పోలీస్ స్టేషన్  కు వెళ్లి తన భర్త ఎక్కడని పోలీసులను ప్రశ్నించింది. 

మంగళవారం రాత్రి క్యూన్యూస్ ఆఫీస్ పై పోలీసులు దాడి చేసి మల్లన్న, విఠ్టల్ తో సహా ఎనిమిది మందిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.  మల్లన్న పై పోలీసులు ఐపిసి 307 సెక్షన్ తో సహా పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మల్లన్న అయన అనుచరులు ఓ పోలీస్ కానిస్టేబుల్ తో పాటు సాయి కిరణ్ గౌడ్ అనే వ్యక్తిపై దాడి హత్యా యత్నం చేశాడని పోలీసులు అభియోగం మోపారు. 

మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్ పై రెండురోజుల క్రితం సాయి కిరణ్ గౌడ్ తో పాటుమరి కొందరు దాడి చేసి విధ్వంసం జరిపారు. ఈ ఘటనలో మల్లన్న  అనుచరులు సాయి కిరణ్ గౌడ్ ను పట్టుకోగా మిగతా వారు పారి పోయారు.  ఈ సంఘటనపై మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా దుండగులను ఎవరిని అరెస్ట్ చేయక  పోగా మల్లన్న అయన అనుచరులపై ఉల్టా కేసులు నమోదు చేసారని మల్లన్న అనుచరులు ఆరోపించారు. కావాలనే పోలీసులు మంత్రి కెటిఆర్ ఆదేశాలతో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారని ఆరోపించారు.

తీన్మార్ మల్లన్న పై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి.  ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆయన కుమారుడు కెటిఆర్ ను మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా దుయ్యబట్టడంతో  ప్రభుత్వానికి టార్గెట్ అయ్యాడు. పలు మార్లు గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు