రాత్రి సమయాల్లో లౌడ్ స్పీకర్లు, బ్యాండ్ ఉపయోగిస్తే చర్యలు తప్పవు


వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్



 సమయ పాలన పాటించకుండా లౌడ్ స్పీకర్లు, వాయిద్యాలు (బ్యాండ్) ఉపయోగిస్తే వారిపై చట్ట పరమైన


చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు సమయ పాలన పాటించకుండా లౌడ్ స్పీకర్లు వినియోగిస్తుడంపై పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుందడంతో దీనిపై వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాలతో పాటు విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ కమీషనర్ సమయపాలన పాటించని లౌడ్ స్పీకర్లు వినియోగంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా వ్యక్తులు, సంస్థలుగాని లౌడ్ స్పీకర్లును ఉ దయం ఆరు గంటల ముందుగాని రాత్రి పది గంటల తరువాత గాని లౌడ్ స్పీకర్లు ను వినియోగించరాదని, ముఖ్యంగా ఇంటిలో జరిగే శుభకార్యాలతో పాటు ఇతర సందర్భాల్లో రాత్రి సమయంలో డి.జె.లు, వాయిద్యాలు(బ్యాండ్), క్రాకర్లను కాల్చిశబ్ద కాలుష్యంతో పాటు వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, విధ్యార్థులు, సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని.. ఇకపై ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని, అలాగే ఏవారైనా రాత్రి సమయాల్లో డి.జె నిర్వహిస్తున్న అధిక శబ్దాలతో వాయిద్యాలు( బ్యాండ్ ) మ్రోగించిన, క్రాకర్లు కాల్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే డయల్ 100 నంబర్ కు ఫోన్ సమాచారం అందించడం ద్వారా స్థానిక పోలీసులు వారిపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ సదరు అధికారి వారిపై చర్య తీసుకుని ఎదల వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 8712685100 కు సంక్షిప్త సమాచారంతో మెసేజ్ చేయవలసిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు