పేదోళ్ల జనహృదయ నేతకు ఘననివాళులు

 


రాజకీయాల్లో నిస్వార్దంగా ఉండే వారు చాలా అరుదు. జన హృదయనేతగా జనం గుండెల్లో ఎల్లకాలం నిలిచి పోయే నేతగా కొందరికే ఆ కీర్తి దక్కుతుంది.  అలాంటి కీర్తి కండూతిని స్వంతం చేసుకున్న గరీబోళ్ల  నేత నల్లెల్ల కుమార స్వామి. కొందరు లీడర్లు  పదవుల కోసం సంపదల కోసమే రాజకీయాలను వృత్తిగా ఎంచుకుంటారు. కొందరు నేతలు జనం గోస చూడలేక రాజకీయాల్లో అనివార్యంగ వచ్చి నిలిచి పోతుంటారు.   పదవుల కోసం సంపదల కోసం కాకుండా తన దగ్గరికి "కుమారన్నా" అంటూ వచ్చే వారెవరైనా ఏ ఆర్ద రాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ ఓదార్చి వారి  హృదయాల్లో నిలిచి పోయిన  నేత.  పిల్లల కోడిలా ఎప్పుడూ పది మందితో కనిపించే సామాజిక పారం పరిక ఆయనది.

విద్యార్థి దశ నుండి ఇదే వరుస

 ఎంతో ఎత్తుకు ఎదగాల్సి ఉండేది ఎంతో సంపాదించాల్సి ఉండేది. కాని ఆయన ఏమి సంపాదించ లేక పోయాడని నల్లెల్ల కుమార్ ను దగ్గరి నుండి ఎరిగిన మిత్రులు, భందువుల నోట తరుచూ వెలువడే  స్టేట్ మెంట్లు. కాని నల్లెల్ల కుమార్ జీవితం ఆడంబరాలకు అతీతం. గరీబోళ్ల బిడ్డగా గరీబోళ్ల కోసం జీవితాంతం అండగా నిలబడ్డ నేత. తరతమ బేధం లేకుండా పార్టీలకు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా  నిలిచిన వ్యక్తి. జనం గుండెల్లో గూడుకట్టుకున్న నేత ఏం సాధించాడంటే  ఏం జవాబు చెప్పడం.


 ప్రైవేట్ వాహనాల సంఘం జిల్లా రాష్ర్ట స్థాయి నేతగా  తెలుగు యువత నేతగా పలు కార్మిక సంఘాలకు గౌరవాద్యక్షులుగా వార్డు మెంబర్ స్థాయి నుండి సర్పంచ్ గా  ఎంపిటిసీ స్తాయి నుండి ఎంపీపీగా జెడ్పీటీసిగా జిల్లా స్థాయి లో కాంగ్రేస్ పార్టి అధ్యక్షులుగా కాపు సంఘం నేతగా పలుకుబడి పొందాడు నల్లెల్ల కుమార స్వామి.


నల్లెల్ల కుమార్ ఇక లేడనే వార్తతో అందరిలో  కట్టులు తెంచుకున్న దుఖ్ఖం.... ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తోబుట్టువు కంటే ఎక్కువ. నల్లెల్ల కుమార స్వామి  ఇక లేరంటే దుఖ్ఖం దిగ మింగు కోలేక భోరున విలపించింది సీతక్క. చిన్ననాటి సహచర మిత్రుడు  కేంద్ర మాజి మంత్రి పోరీక బలరాం నాయక్ దీ  ఓదార్చలేని దుఖ్ఖం. వారిద్దరిది విడదీయ లేని అనుభందం. రాజకీయాల్లో అటు బలరాం నాయక్ కు ఇటు సీతక్కకు నల్లెల్ల కుమార స్వామి ములుగు నియోజక వర్గంలో  కుడి భుజంగా నిలిచిన నేత . ఆప్తమిత్రుడు తిరుపతి రెడ్డి దీ వొడవని దుఖ్ఖం.


నల్లెల్ల కుమార స్వామి  మరణం ములుగు వాసులకు ఆయనకు అత్యంత సన్నిహిత సహచరులకు అనేక మందికి తీరని లోటు.

నల్లెల్ల కుమార స్వామిని మహమ్మారి రోగం ఆవరించినప్పటి నుండి   ఆప్తులు స్నేహితులు  ముఖ్యంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇతర కాంగ్రేస్ పార్టి నేతలు మున్నూరు  కాపు సంఘం నేతలు  అన్ని విధాలుగా అండగా నిలిచారు. ప్రాణాపాయం తప్పించేందుకు ఎంతటి సహాయానికైనా సిద్దమని ధైర్యాన్ని అందించారు. 

అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ ఐ స్నేహితుడు లింగారెడ్డి  నిన్ను బతికించుకుంటారాం అంటూ తోచిన సహాయంచేసి ధైర్యం చెప్పాడు. 


కాని  మాయదారి రోగం కుటుంబ సబ్యులతో పాటు అందరికి దూరం చేసి తీవ్ర విశాదం మిగిల్చింది. నల్లెల్ల కుమార స్వామి ఇక లేడనే  వార్త అందరినీ దుఖ్ఖ సాగరంలో ముంచెత్తింది. 


తెలంగాణ ఉద్యమంలో నల్లెల్ల కుమార స్వామి ములుగు ప్రాంతం నుండి కీలక పాత్ర పోషించాడు.  1997 ప్రాంతంలో  మొదలైన తెలంగాణ మహాసభ కు  సంఘీభావంగా నిలిచారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీలో కీలక భూమిక పోషించి క్రియాశీలక నేతగా ఎదిగారు.  ఈ క్రమం లోనే సుదీర్ఘకాలంగా తనకు ఎంతో సన్నిహితులు అయిన మాజి మంత్రి అజ్మీరా చందూలాల్ ను తెలుగుదేశం పార్టీని వీడారు.


తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి  పథకం అమలు చేసేందుకు నల్లెల్ల కుమార స్వామి  ప్రాతినిద్యం తోడ్పడింది.  ఓ గిరిజన యివతి పెండ్లి కోసం కూడబెట్టుకుని ఇంట్లో దాచుకున్న నగదు అగ్నికి ఆహుతి కాగా  నల్లెల్ల కుమార స్వామి పార్టి నేత కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్లగా పెండ్లికి కావల్సిన  ఆర్థిక సహాయం చేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కళ్యాణ లక్ష్మి పథకం రూపకల్పన చేసేందుకు ఆనాటి సంఘటన స్పూర్తిగా నిలిచింది. 


నల్లెల్ల కుమారస్వామి తో అందరిదీ అరమరికలు లేని భందం. స్నేహంలో చెరగని ముద్ర..శాశ్వతంగా జన హృదయాలలో గూడుకట్టుకున్న జ్ఞాపకం

ఆయన లేనిలోటు కుటుంబ సబ్యులకు స్నేహితులకు భందువులకు తీరని లోటు.....


జోహార్ కాక 

కూన మహేందర్ 

జర్నలిస్ట్

ములుగు


 
కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు