వై.ఎస్ షర్మిల ఆంధ్రాకు వెళ్లి మొరపెట్టుకుంటే మంచిది - మాజి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

 


కోర్టు అనుమతులతో పాదయాత్ర చేస్తున్న వై.ఎస్ షర్మిల అధికార బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి రెచ్చగొట్టే రీతిలో విమర్శలు చేస్తోంది. తమతో ఒక్క రోజైనా ముఖ్యమంత్రి కెసిఆర్ పాదయాత్ర చేయాలంటూ సవాల్ చేస్తూ ప్రగతి భవన్ కు షూ పంపిన షర్మిల తాజాగా బడ్జెట్ పై ఘాటు విమర్శలు చేసి బిఆర్ఎస్ నేతల ఆగ్రహానికి గురయ్యారు.

"ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ కొత్త సీసా తీసుకొని హరీష్ రావు ఫామ్ హౌస్ కి వెళితే ఆయన మామ ఆ సీసాలో పాత సారా పోశారు" అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల బిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. 

షర్మిల చేసిన విమర్శను బిఆర్ఎస్ సీనియర్ నేత మాజి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సి కడియం శ్రీహరి తప్పు పట్టారు.  వ్యంగ్యందా షర్మిల చేసిన విమర్శను తిప్పుకొడుతూ షర్మిల తన భాదేంటో ఆంధ్రాకు వెళ్లి ప్రజలకు మొరపెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ లో తిరిగి అనవసరంగా షర్మిల సమయం వృధా చేసుకోవద్దని అన్నారు. రేపో మాపోజగన్ జైళుకు వెళితే నీకు అవకాశం వస్తుందని అన్నారు.

వై.ఎస్ కుటుంబం మొత్తం మొదటి నుండి తెలంగాణ కు వ్యతిరేకమన్నారు. జగన్ జైళ్లో ఉన్నపుడు వై.ఎస్ విజయ లక్ష్మి, వై.ఎస్ షర్మిల పాదయాత్రలు చేసారని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వారికి రాజకీయంగా అన్యాయం చేశారన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు