యాజమాన్యాల యాడ్స్ కక్కుర్తికి బలవుతున్న జర్నలిస్టులు

 వత్తిడి తట్టుకోలేక అగిన జర్నలిస్టు గుండె


 తాడేపల్లిగూడెం ప్రైమ్ 9 జర్నలిస్టు మృతి


పత్రికల చానల్స్ యాజమాన్యాల ఒత్తిడి వల్ల విలేకరుల జీవితాలు బలవుతున్నాయి. ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్ మళ్లీ తెమ్మని ఒత్తిడి చేయడం వల్ల చెన్నకేశవ పొద్దుటి నుండి యాడ్లు కోసం తిరిగి తిరిగి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చి పడిపోయి మరణించాడు. యాజమాన్యాల జీతాల ఇవ్వక, యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల అనేకమంది విలేకరులు గతంలో మరణించారు. రెండు సంవత్సరాల క్రితం రాజమండ్రి స్టాఫ్ రిపోర్టర్ జుట్ట గణపతి యాజమాన్యాల ఒత్తిడి తో అప్పులు చేసి ,యాడ్స్ బిల్లులు చెల్లించి కుటుంబాన్ని పోషించలేక అప్పులు తీర్చలేని పరిస్థితిలో మరణించారు. జనవరి రాకతో కోరలు తెంచుకున్న విషపు నాగుల్లాగా కొన్ని పత్రికల, న్యూస్ ఛానళ్ల ఎండీలు, సీఈవోలు, హెచ్ఆర్ లు,, మార్కెటింగ్ హెడ్ లు, ఇన్ పుట్ ఎడిటర్లు ఇలా వరుస బ్లాక్మేయిలింగ్ వ్యవహారాలతో రిపోర్టర్స్ నిత్యనరకం చూస్తూన్నారు. కార్మికశాఖ నిర్లక్ష్యం, ఉద్యోగ‌ భద్రత లేక జర్నలిస్టులు యాజమాన్యాల వేదింపును బరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా రోజు టెన్షన్ జీవితాలను గడుపుతూ తన ఆయుష్షును సైతం తగ్గించుకుని పని చేస్తున్న సంస్థ ఆయుష్షు పోస్తున్నారు. కానీ రిపోర్టర్స్ మనో వేదన మాత్రం ఏ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఎవడో, ఎక్కడో బ్లాక్మేయిల్ చేయడం, అది చూసి మా రిపోర్టర్స్ కు బానే వస్తుందనే తుచ్చ బావనలో యాజమాన్యాలు జర్నలిస్టులను విపరీతంగా టార్చర్ చేస్తున్నాయి. అందరి బాగోతాలు బయట పెట్టే జర్నలిస్టులు, ఆయా సంస్థల బాగోతాలు మాత్రం బయటపెట్టరు. అలా బయటపెట్టండం మొదలు పెడితే ఏండీలు, సీఈవోలు, హెచ్ఆర్ లు, ఇన్ పుట్ ఎడిటర్లు ఇప్పటికే చాలా మంది ఊచలు లెక్కపెట్టేవారు. ఆ సంస్థలు మూతపడేవి. వాస్తవాకి జనవరి రావడంతో, జర్నలిస్టులకు గుదిబండగా మారింది‌. యాడ్స్ పేరు చెప్పి పత్రికా, టీవీ ఛానల్ యాజమాన్యాలు జర్నలిస్టుల‌ను నేరుగా బ్లాక్మేయిల్ చేస్తున్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం రిపోర్టర్ చెన్నకేశవ మృతి‌కూడా దీనికి సంబంధించినదే. ఇప్పటీ జర్నలిస్టులు ఐక్యతగా లేకపోతే రేపటి రోజు మరికొంతమంది జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడుతుంది. నిజానికి జర్నలిస్ట్ అంటే ఒకప్పుడు కలం పట్టిన సైనికుడు, జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు. కాని నేడు జర్నలిస్టు అంటే డబ్బుల కోసం వేటాగాడవుతున్నాడు. అది తన కోసమా అంటే కాదు ఆయా సంస్థ కోసం, పెరిగిన టెక్నాలజీతో ఇబ్బందులు పడుతున్న పత్రికలు, మీడియా సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కానీ ఆ భారాన్ని మార్కెటింగ్ చేసుకునే విధంలో ఫేయిల్ అయ్యి, నేడు మీడియా యాజమాన్యాలు, పత్రికా యాజమాన్యంలో జర్నలిస్టులపై పడ్టాయి. కొందరు నెల వారి టార్గెట్లు, కొందరు క్యాలెండర్ పేరులో నేరుగా జర్నలిస్టులను ఆఫీసులకు పిలిచి బ్లాక్మేయిలింగ్ కు తెగబడుతున్నాయి. సమాజాన్ని బాగుచేద్దాం, అవినీతిని అంతమొందిద్దాం అనే స్లోగన్లతో తొలుత పత్రికా, శాటిలైట్ పర్మిషన్లు పొంది, తర్వాత జర్నలిస్టులకు సరిగా జీతాలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఎడాది ప్రారంభమై జనవరి వస్తుందనగా టార్గెట్ల పేరుతో జర్నలిస్టులపై జూలు విధిస్తున్నాయి. స్టేట్ పత్రికలు, జిల్లా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని సంస్థలు, కొత్తగా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానళ్లు యాడ్స్ పేరుతో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా టార్గెట్లు పెడుతూ జర్నలిస్టులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎవరైన ఎదిరించి మాట్లాడితే వారిని సంస్థల నుండి తొలగిస్తూ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ నేరుగా నేరాలకు పాల్పడుతున్నా కార్మిక శాఖలు చర్యలు మాత్రం శూన్యం. జర్నలిస్టు యూనియన్లు ఇంత నేరుగా యాడ్స్ పేరుతో బ్లాక్మేయిల్ కు పాల్పడుతున్నా కనీసం పట్టనట్టుగా ఉన్నాయి. జర్నలిస్టు యూనియన్ల పేరుతో ముందున్న నాయకులు సొమ్ము చేసుకుంటూ యూనియన్లను అడ్డంపెట్టుని బ్రతకడానికే ప్రాధాన్యం తప్పా జర్నలిస్టు సంక్షేమానికి ఏ యూనియన్ కృషి చేయడం లేదు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని సంస్థలు క్యాలెండర్ వంటి ప్రింట్ పర్మిషన్ కూడా లేకుండా యాడ్స్ ను సేకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. నేరుగా ఉద్యోగాలు పీకేస్తామంటూ బెదిరించడంతో చెన్నకేశవ లాంటి వారు చనిపోగా మిగిలినవారు బ్రతికుండి‌ జీవశవాల్లా యాడ్స్ కోసం పరిగెడుతున్నారు. ముఖ్యంగా ఈనాడు, సాక్షీ, ఆంధ్రజ్యోతి పత్రికల మాట ఎలా ఉన్నా మిగిలిన పత్రికలు ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో టివి9, ఎన్టీవీ, 10టీవీ, ఈటీవీ2, v6, Abn, సాక్షీ మినహా మిగిలిన ఛానళ్ల యాజమాన్యాలు యాడ్స్ కోసం జర్నలిస్టులను జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న కాక మొన్న వచ్చిన స్వతంత్ర, ప్రైమ్9 యాజమాన్యాల దగ్గర నుండి ఎప్పుడో వచ్చిన సీవీఆర్, ఐన్యూస్, 99టీవీ, రాజ్ న్యూస్, స్టుడియో ఎన్, భారత్ టు డే, 6tv యాజమాన్యాలు జర్నలిస్టులపై బ్లాక్మేయిల్ చేసి యాడ్స్ పేరుతో లక్షలాది రూపాయలు కాజేస్తున్నాయి. నిత్యం అడ్వాన్సులు, యాడ్స్ డబ్బుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇందుకు వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా సమాచార శాఖ పర్యవేక్షణ, కార్మిక శాఖ కూడా ఎక్కడ తమ మీద వార్తలు వేస్తారో అనే భయంతో తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తూ ఉండటంతో మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులను క్యాలెండర్, నెలవారి యాడ్స్ పేరుతో నేరుగా బ్లాక్మేయిలింగ్ కు పాల్పడుతున్నాయి. పత్రిక ఎడిటర్లు, న్యూస్ ఛానళ్ల సీఈవోలు, ఇన్ పుట్ ఎడిటర్లు వారి ఉద్యోగాలు వారు కాపాడుకొనేందుకు కింది స్థాయి జర్నలిస్టులను నిత్యం యాడ్స్ కోసం వేధిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సేకరించిన యాడ్స్ ద్వారా వచ్చిన నగదులో కనీసం ఇన్ట్కమ్ ట్యాక్స్ లు కూడా చెల్లించకుండా నగదును సొమ్ము చేస్తూ ప్రభుత్వ ఆదాయాలకు గండి కొడుతున్నాయి ఈ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని సంస్థలు. ఈ విధానాలతో తెలంగాణ, ఆంధ్రాలోని సగటు జర్నలిస్టు మానసికంగా కృంగిపోతున్నాడు. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో రోగాలపాలవుతున్నాడు. ఉద్యోగ రక్షణ లేకపోవడంతో జర్నలిస్టులు ఆర్థికంగా వెనకబడి యాజమాన్యాల బెదిరింపులతో ఆత్మహత్యలు చేసుకునేందుకు వెనుకాడటం లేదు. ఈ విధాలను మారాలంటే ఆయా పత్రికలు, మీడియా యాజమాన్యాలపై బహిరంగ విచారణలు జరిపి చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానం సైతం ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకుని విచారణు జరిపించాలి. ట్యాక్స్ లు చెల్లించకుంటా భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్న విధానంపై ఐటీ సంస్థలు సైతం వీటిపై నిరంతర దాడులు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సమాజం మారంటే ముందు మారాల్సింది మీడియా యాజమాన్యాలు, అందరికీ నీతులు చెప్పే మీడియా సంస్థలు మాత్రం ఆ నీతులు పాటించవు. కనీసం ఒకటి, రెండు బ్లాక్మేయిలింగ్ సంస్థలపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటే తప్పా మిగిలిన వాటిలో మార్పు రాదు. ఇప్పటికైనా చెన్నకేశవ మృతిపై ప్రభుత్వాలు, లేదా న్యాయస్థానాలు సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే బ్లాక్మేయిలింగ్ మీడియా యాజమాన్యాల బాగోతాలు కోకొల్లలుగా బయటపడతాయి.

మన భాష మీద మనం తినే ఉల్లిగడ్డల మీద ఆర్థిక మంత్రి అహంకారం



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు