భైంసాకు రావాలంటే వీసా తీసుకోవాలా -బండి సంజయ్

 


భైంసా నుండి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించిన బిజెపి చీఫ్ బండి సంజయ్ టిఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. తన యాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. భైంసాకు రావాలంటే వీసా తీసుకుని రావాలా అంటూ ప్రశ్నించారు. మనం ఏ రాష్ర్టం ఏ దేశంలో ఉన్నామని అన్నారు.

ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా భైంసా పొలిమేరల్లో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు.

పోలీసులు ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతులు ఇవ్వకపోవడంతో హై కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. భైంసా పట్టణంలోని ఎంటర్ కాకుండా షరతులు విధిస్తూ  హై కోర్టు అనుమతి ఇచ్చింది.

భైంసాలో ప్రజలకు భరోసా కల్పించేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగిరేది కాషాయ జెండానే అని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామన్నారు.  భైంసా పేరును మహిశాగా మారుస్తామన్నారు. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీయాక్ట్‌లు ఎత్తి వేస్తామని అన్నారు. వారికి ఉద్యోగాలిచ్చి గౌరవించుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన  5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ, దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే బీజేపీ నేతలపై ఆంక్షలు విధిస్తారా అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలు పెడితే నిషేధించే స్థాయికి దిగజారారని అన్నారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతు ఇక  కేసీఆర్‌కు భయపడే రోజులు పోయాయని  అన్నారు. పోలీసులతో ఏమీ చేయలేరు.. ఎంతమందిపై కేసులు పెడతారని ఈటల ప్రశ్నించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను పోలీసులతో కట్టడి చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలను పట్టించుకోరని, కేసీఆర్‌ ఆలోచనంతా ఇతర పార్టీల నేతలను కొనేదానిపైనే ఉందని ఈటల మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్ అని పోలీసులు మర్చిపోవద్దని, బీజేపీ గెలుపును కేసీఆర్ ఆపలేరు ఈటల పేర్కొన్నారు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో కెసిఆర్ రాచరిక పాలన సాగిస్తున్నాడని బిజెపి చేపట్టిన యాత్రను అడ్డుకునేప్రయత్నం చేశాడని ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరం అయితే  జైళుకైనా వెల్తామని పేర్కొన్నారు. 2024 లో బీజేపి తిరిగి అదికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రదానమంత్రి మోదీని అడ్డుకునేందుకు వెయ్యిమంది కెసిఆర్ లు బిఆర్ఎస్ లు ఎంఐఎంలు వచ్చినా ఎవరి తరం కాదన్నారు. బిఆర్ఎస్ పార్టి పెట్టిన కెసిఆర్ కు ఒక్కసీటైనా వస్తుందా అని ప్రశ్నించారు.

వై.ఎస్ ఆర్ పార్టి నాయకురాలు షర్మిలపట్ల టిఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు అనుసరించినవైఖరిని ఖండించారు. ఒక మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టిఆర్ఎస్ నాయకులు కెసిఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైందన్నారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన అజెండాగాటిఆర్ఎస్ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు