ప్రగతి భవన్ ముట్టడి కోసం షర్మిల హై డ్రామా - అరెస్ట్ చేసిన పోలీసులు – గృహ నిర్భందంలో విజయమ్మ

 


నర్సంపేటలో  తనపై జరిగిన దాడిని నిరసిస్తూ వై.స్ ఆర్ పార్టి అధినేత షర్మిల మంగళవారం ప్రగతి భవన్ వద్ద హై డ్రామా సృష్టించారు. తన అనుచరులతో ప్రగతి భవన్ ముట్టిడించేందుకు బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డగించారు. కారు నడుపుతున్న షర్మిలను కారుదిగాలని పోలీసులు కోరగా ఆమె నిరాకరించారు. పోలీసులతో వాదనకు దిగారు.దాంతో పోలీసులు క్రేన్ వాహనం తెప్పించి కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి కూడ కారు దిగేందుకు షర్మివల ఒప్పు కోక పోగాకారు అద్దాలు పగల గొట్టి డోర్లు తెరిచి షర్మిలను ఆమె అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. పోలీస్ స్టేషన్ లోషర్మిల దీక్ష చేపట్టారు.

షర్మిల కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన పార్టి కార్యకర్తలను వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేశారు.

మరోవైపు షర్మిల తల్లి విజయమ్మ లోటస్ పాండులో దీక్షకు దిగారు.  షర్మిల కోసం పోలీస్ స్టేషన్ కు బయలు దేరిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దాంతో విజయమ్మ ఇంట్లో నిరసన దీక్ష చేపట్టారు.

షర్మిల యాత్రకు హై కోర్టు అనుమతి

ఇదిలా ఉండగా షర్మిల పాద యాత్రకు హై కోర్టు అనుమతి ఇచ్చింది. తన యాత్రను పోలీసులు అడ్డుకున్నారని షర్మిల హో కోర్టును ఆశ్రయించగా కొని నిభదనలు విధిస్తూ హై కోర్టు అనుమతి ఇచ్చింది. యాత్ర కోసం అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని హై కోర్టు షర్మిలకు సూచించింది. ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని మత పరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని షరతులు విధించింది.

 షర్మిలను  ఆమెతో పాటు మరో ఆరుగురిని పోలీసులు రిామాండ్ చేసే అవకాశాలున్నాయి. అందుకోసం వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

షర్మిల అరెస్ట్ వీడియో 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు