వైఎస్‌ను కుట్ర చేసి చంపారు నన్నూ చంపుతారు.. షర్మిల సెంటి మెంట్ వ్యాఖ్యలు

 

తండ్రి పేరుతే సెంటిమెంట్ డ్రామాకు తెర లేపిన షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. 


వైఎస్సార్ సిపి అధినేత్రి వైఎస్ షర్మిల తన తండ్రి పేరును వాడుకుని సెంటి మెంట్ డ్రామాకు తెర లేపారు. తన తండ్రిని కుట్రచేసి చంపారని తనను కూడ అట్లాగే చంపాలని చూస్తున్నారంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు.  తన పాద యాత్ర చూసి ఓర్వలేక పోతున్నారని  తన పాదయాత్రను ఆపాలని చూస్తున్నారని అన్నారు.  పాదయాత్ర చేస్తూ.. నియోజకవకర్గాల వారీగా సమస్యలను ఎత్తి చూపడం తప్పు అన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా వెళ్లి స్పీకర్‌కు తనపై ఫిర్యాదు చేశారని వాళ్ల అవినీతి, భూకబ్జాలు, దౌర్జాన్యాల గురించి నేను మాట్లాడటం తప్పైందని ఎమ్మెల్యేలు తనపై ఫిర్యాదు చేశారన్నారు. 

మంత్రి నిరంజన్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారని చెప్పిన షర్మిల.. తనపై నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్లపై ఫిర్యాదు చేసినా వనపర్తి పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.  ఏ క్షణమైన తన పాదయాత్రను అడ్డుకొని అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

తాను పులిబిడ్డ నంటూ  బేడీలకు భయడేది లేదంటూ బేడీలు చూపుతూ మాట్లాడారు. కేసీఆర్‌కు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ బిడ్డను ఈ బేడీలు నన్ను ఆపుతాయా? అని ప్రశ్నించారు. తనకు ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి తనను వేరు చేయడం ఎవరి తరం కాదన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర లో భాగంగా బాలానగర్ మండలం జిల్లెల గడ్డ తండా లో  మీడియా సమావేశం నిర్వహించారు.

"ఒక మహిళను ఎదుర్కోలేక ఇంత మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఒక్కటిగా ఈ ఎమ్మెల్యేలంతా ఎందుకు కొట్లాడలేదు. మీకు ఆ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమని  వైఎస్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తే  కేసీఆర్ రీడిజైనింగ్ చేశారని  అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకొని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ ఎనిమిదేళ్లయినా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.  ఈ విషయమై పాలమూరు ఎమ్మెల్యేలు ఎందుకు సీఎంను నిలదీయలేదున్నారు.  కనీసం నోరు విప్పి మాట్లాడారా అంటూ  అని షర్మిల ప్రశ్నించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు