అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ పై సుప్రీం నోటీసులు

 

అసెంబ్లి సీట్ల పెంపుపై సుప్రీం కోర్టు రెండు కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.  అసెంబ్లి సీట్ల పెంపు విషయంలో కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారి చేయాలని  ప‌ర్యావ‌ర‌ణ నిపుణుడు ప్రొఫెస‌ర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్‌ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. కేంద్రంతో పాటుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుకూడ ప్రతి వాదులుగా చేర్చారు. పురుషోత్తం రెడ్డి పిటిషన్ పై  సుప్రీం కోర్టు సోమవారం  విచారణ చేపట్టింది. కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారి చేసింది. 


రాష్ట్ర విభజన జరిగి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లి, పార్లమెంట్ స్థానాల సీట్ల సంఖ్య పెరగాల్సి ఉంది. ఈ విషయం ఏపి పునర్ విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే కేంద్రంలో బిజెపి సర్కార్ ఈ విషయాన్ని కావాలనే తొక్కి పెడుతుందో లేక రాజ్యాంగ పరమైన చిక్కులు ఏమైనా అడ్డువస్తున్నాయ తెలియదు కాని 8 ఏండ్లు కావచ్చినా సీట్ల సంఖ్య పెంచ లేదు. 


ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలంగాణ లో అసెంబ్లి సీట్లసంఖ్య  119 నుండి 153సీట్లకు పెంచాల్సి ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో  సుప్రీంకోర్టు  175 సీట్ల నుండి 225 సీట్ల వరకు సంఖ్య పెరగాల్సి ఉంది. 

ఈె రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలో కేంద్రానికి పలు మార్లు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలలో బిజెపి పట్టు కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. తెలంగాణ లో అయితే అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి  తీరుతామని బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సీట్లు సంఖ్య పెంచితో అధికార టిఆర్అస్ పార్టీకి అనుకూలంగా మారుతుందన్న కారణంతోనే కేంద్రంలో బిజెపి సర్కార్ సీట్ల సంఖ్య పెంచడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు