హైదరాబాద్ లో మత కలహాలకు కెసిఆర్ కుట్ర - బండి సంజయ్

 ఎంఐఎంతో కలిసి హైదరాబాద్‌లో అల్లర్లకు పన్నాగం

లిక్కర్ కుంభకోణం దృష్టి మళ్లించేందుకు అల్లర్లకు కుట్ర

27 న హన్మకొండలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ


హైదరాబాద్‌లో మత కలహాలకు  సీఎం కేసీఆర్  పథకం పన్నారని బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.  ఎంఐఎంతో కలిసి హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర పన్నారని  ఇది ముమ్మాటికీ నిజమని ఆయన అన్నారు.

కరీంనగర్ లో టిఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా ఉదయం నుండి మద్యాహ్నం వరకు బండి సంజయ్ దీక్ష చేశారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతు ప్రజల దృష్టి మళ్లించడానికే నన్ను అరెస్టు చేశారు. ఇసుక బుక్కేది వాళ్ళే లిక్కర్ దందాలో వాళ్ళే డ్రగ్స్ భూ మాఫియా ఏదైనా వాళ్ళే. ఎక్కడ ఐటీ దాడులు జరిగినా వాళ్ల మూలాలు వాటాలే. 1400 మంది ఆత్మ బలిదానాల మంటల్లో సీఎం కేసీఆర్ చలి కాల్చుకుంటున్నారు. లిక్కర్ ఆరోపణలు డైవర్ట్ చేసేందుకు హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర పన్నారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతూ, పాదయాత్రను అడ్డుకుంటోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబం జోలికి వస్తే పరిస్థితి ఇలా ఉంటుందని వార్నింగ్ వచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని అన్నారు.  మీ తాత జేజమ్మలు వచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని అన్నారు.. రాడ్‌లతో వచ్చినా రాళ్లతో వచ్చినా సరే యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేసారు. ఎట్టి పరిస్థితితిలో ఈ నెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిపి తీరుతామని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆధ్వర్యంలో సభ జరుగుతుందని  అని బండి సంజయ్‌ తెలిపారు.

లిక్కర్ స్కామ్ విషయాలు బయటపడుతాయన్న భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా షెడ్యూల్ ప్రకారమే యాత్ర ముగిస్తాం. ఈనెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో మ. 2గం.లకు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని బండి సంజయ్ ట్వీట్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు