బం‍డి సంజయ్‌ అరెస్ట్‌ - కరీంనగర్ కు తరలింపు

 పాదయాత్ర ఆపేది లేదన్న బండి సంజయ్



పాదయాత్రలో ఉన్న బిజెపి చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కరీంనగర్ కు తరలించారు. ఎమ్మెల్సి కవిత ఇంటి వద్ద  నిరసన  దిగిన బిజెపి కార్యకర్తలపై హత్యానేరంతో పాటు ఇతర సెక్షన్ల కింద  పోలీసులు కేసులు నమోదు చేయడమే కాక బల ప్రయోగం చేశారని నిరసిస్తూ  బిజెపి నేతలు రాష్ర్ట వ్యాప్తంగా చేపట్టిన  నిరసనలను పోలీసులు భగ్నం చేసారు. ఎక్కడి కక్కడే బిజెపి నేతలను గృహ నిర్భందం చేశారు. కార్యకర్తలను అరెస్ట్ చేసారు. 

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్‌ చేశారు. ఈసందర్భంగా  బిజెపి కార్యకర్తలు పోలీసులను అడ్డుకుకోగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను బలవంతంగా అడ్డుతొలగించి బండి సంజయ్ ను అక్కడి నుండి కరీంనగర్ కు తరలించారు.

తనను ఎందుకు అరెస్ట్‌ చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. 21 రోజులుగా యాత్రపైలేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. ఈరోజే తన యాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటని నిలదీశారు. ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభిస్తానని బండి సంజయ్‌ తెలిపారు. కూతురిని కాపాడుకునేందుకు తన యాత్రను కేసీఆర్‌ అడ్డుకున్నారని విమర్శించారు.కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కూతురికి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేయడలేదని నిలదీశారు. పాదయాత్రపై దాడి చేస్తే ప్రజలు బడిత పూజ చేస్తారని మండిపడ్డారు. 

పాదయాత్ర చూసి ఓర్వలేకే కెసీఆర్ తనను అరెస్టు చేయించారని కెసిఆర్ కు మూడిందని ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువన్నట్లు కెసిఆర్ ఎగిసి పడతున్నాడని విమర్శించాడు. పాదయాత్రపై గూండాలతో దాడులు చేయించారని ఇప్పుడు పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని కేసులకు భయపడేది లేదని యువకులు తరలి రావాలని బండి సంజయ్ కోరాడు.

ఫోన్ లో మాట్లాడిన అమిత్ షా

బండి సంజయ్ అరెస్టు ను కేంద్ర మంత్రి అమిత్ షా ఆరా తీసారు. నేరుగా బండి సంజయ్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెల్సుకున్నారు. పాద యాత్ర కు జనం స్పందన చూసి ఓర్వ లేకే అరెస్టు చేయించారని బండి సంజయ్ వివరించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు