బిజెపి ఎమ్మెల్యే కు ఊహించని షాక్ - పార్టి నుండి సస్పెండ్

 


హిందుత్వం పేరిట తరుచూ రెచ్చిపోయే బిజెపి గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టి ఊహించని షాక్ ఇచ్చింది. మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. నుపూర్‌ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా  ​మొదలైన వివాదం సమిసి పోకముందే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంభందించిన వీడియో కూడ విడుదల చేసాడు. దాంతో ముస్లీం  మైనార్టీలు రాజాసింగ్ పై చర్యలకు డిమాండ్ చేస్తు ఆందోళనకు దిగారు.  దాంతో బిజెపి అధిష్టానం రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించింది.  రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. అంతే కాక పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణం ఉత్తర్వులు ఆమల్లోకి వస్తాయని పేర్కొంది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబరు 2 లోపు వివరణ ఇవ్వాలంటూ రాజాసింగ్ కు బీజేపీ హైకమాండ్ పది రోజుల సమయం ఇచ్చింది. రాజాసింగ్ ఆయన నివాసంలో పోలీసులు అద్పులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ను రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజాసింగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్‌, బహదూర్‌పురా, బాలానగర్‌, డబీర్‌పూర, సంగారెడ్డి నిజామాబాద్‌లో రాజాసింగ్‌పై కేసులు ఫైల్‌ చేశారు. ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు