మ‌త‌పిచ్చిగాళ్ల‌ను ఎక్క‌డి క‌క్క‌డ త‌రిమికొట్టాలి - కెసిఆర్ పిలుపు

 




మ‌త‌పిచ్చిగాళ్ల‌ను ఎక్క‌డి క‌క్క‌డ త‌రిమికొట్టాలని సిఎం కెసిఆర్ పిలుపు నిచ్చారు. మ‌త‌పిచ్చిలో పడితే  వంద సంవ‌త్స‌రాలు తెలంగాణ‌, భార‌త‌దేశం ఆగ‌మైత‌దన్నారు. ఒక్క‌సారి దెబ్బ‌తింటే. విభ‌జ‌న వ‌స్తే స‌మాజం కోలుకోలేదన్నారు. 

 రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాలయ సముదాయానికి సిఎం కెసిఆర్ గురువారం ప్రారం ప్రారంభోత్స‌వం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన బిజెపి నేతలపై మండిపడ్డారు. " ఐక్య‌త దెబ్బ‌తిన్న‌నాడు, మ‌త శ‌క్తుల పిచ్చికి లోన‌యిన్ప‌పుడు, మ‌నం చెదిరిపోయిన్నాడు మ‌ళ్లీ పాత తెలంగాణ‌లాగా త‌యార‌వుతాం. బ‌తుకులు ఆగం అవుతాయి. వీళ్లు ఎక్క‌డా ఉద్ద‌రించింది లేదు. కుట్ర‌ల‌కు కాలు దువ్వుతున్నారు. స్వార్థ‌, నీచ‌, మ‌త‌పిచ్చిగాళ్ల‌ను మ‌నం ఎక్క‌డిక‌క్క‌డ త‌రిమికొట్టాలి. అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మోస‌పోతే గోస ప‌డుతామ‌ని " కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

‘‘మేధావులు, యువకులను కోరుతా ఉన్న..  ఒక వంద సంవత్సరాలు తెలంగాణ ఆగం అయితది, దేశం ఆగం అయితది, అనురాగంతో ఉండే దేశం బాగుపడుతది కానీ, కోపంతో ఆవేశంతో ఉంటే  ఏ దేశం బాగుపడది”అని కేసీఆర్​ అన్నారు. మనకు శాంతి యుత తెలంగాణ కావాలని ఆయన ఆకాక్షించారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోని భారతదేశానికే తెలంగాణ  (Telangana) ఆదర్శంగా ఉండాలని కేసీఆర్​ ​ అన్నారు. ఎనిమిదేళ్లయినా మోదీ ఏం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం భారతదేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు కేసీఆర్​. సమాజంలో చీలికలకు పాల్పడేవారికి, ప్రభుత్వాలు కూలగొట్టేవారికి ఈ దేశంలో స్థానం లేదని కేసీఆర్​ అన్నారు.

"మోదీ (Modi) ఎందుకు ఆగం అవుతున్నవ్​.. ఉన్న పదవి చాలదా? బిహార్​లో ఏం జరుగుతోంది? బెంగాల్​లో ఏం జరుగుతోంది? అని ప్రశ్నించారు కేసీఆర్​. హైదరాబాద్​ (Hyderabad)లో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతోందని కేసీఆర్​ అన్నారు. ఈ దుర్మార్గులు, ఈ చిల్లరగాళ్లు ఏం చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలి? నేను బతికి ఉండగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను, దీన్ని కాపాడటానికి నా సర్వ శక్తులా పోరాడతా”అని అన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు