ఉదయ్ పూర్ లో దర్జీని నరికి చంపిన దుండగులు

 మత చాందస వాదుల ఘాతుకం

ఉదయ్ పూర్ లో కర్ప్యూ 



రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మత చాందస వాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. మహ్మద్‌ ప్రవక్తపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతు పలికాడన్న ఆరోపణలపై  కన్హయ్యాలాల్‌ అనే దర్జీని నమ్మించి తల నరికి చంపారు. షాపులో తన పని చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు కస్టమర్లుగా షాపులోకి వచ్చి దుస్తులు కుట్టాలని నమ్మించారు.  కన్హయ్యా లాల్‌ వారి దుస్తుల కోసం కొలతలు తీసుకుంటుండగా  వెంట తెచ్చుకున్న కత్తి బయటి తీసి దాడికి పాల్పడ్డాడు.  ఇద్దరు వ్యక్తులలో  ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీస్తుండగా మరో వ్యక్తి దాడి జరిపి కన్హయ్యా లాల్‌ తల నరికి హత్య చేశాడు. 

కొద్ది రోజుల క్రితం కన్హయ్యా లాల్‌ మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన  నూపుర్‌ శర్మనుసమర్దిస్తూ సామాజిక మాద్యమాల్లో పోస్టు పెట్టడంతో ఓ సామాజిక వర్గం వారు అతనితో గొడవ పడ్డారు. కన్హయ్యా లాల్‌ ను చంపాతామంటూ బెదిరించారు. దాంతో కన్ఙయ్యా లాల్ కొద్ది రొజులు షాపు మూసి వేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. పరిస్థితులు సద్దుమనిగాయనుకుని షాపు తెరిచి దుస్తులు కుడుతుండగా ఈ ఘటనకు పాల్పడ్డారు.


హత్య  అనంతరం నిందితులు  అక్కడి నుండి పారి పోయారు. ఉదయ్ పూర్ లో ఈ ఘటన అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి.  తామే ఈ హత్య చేశామంటూ నిందితులు వీడియోలు విడుదల చేశారు. ఇస్లాంకు అవమానం జరిగిందని  అందుకు ప్రతీకారం తీర్చుకున్నామని పేర్కొన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడ  ఇదే విదంగా చంపుతామంటూ వీడియోలో హెచ్చరికలు చేశారు.

ఉదయమ్ పూర్ లో ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా కర్ఫ్యూ విధించారు.  నిందితులను మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌, మహమ్మద్‌ ఘోష్‌గా గుర్తించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరినీ రాజస్థాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్జీ కన్హయ్య హత్య దారుణం అని ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ పేర్కొన్నారు. హత్య ఘటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధాకరమైన, సిగ్గుమాలిన చర్య. హత్య జరిగిన తీరును బట్టి చూస్తే ఇది చిన్న విషయమేమీ కాదని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టబోమని, నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు