ఆర్మి క్యాంపు పై విరిగిపడ్డ కొండచరియలు-ఆరుగురు మృతి-పలువురు గల్లంతు-

 మణిపుర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోనే జిల్లాలోని తుపుల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో  ఆరుగురు సైనికులు మృతి చెందారని  ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇప్పటివరకు 13 మందిని రక్షించామని క్షతగాత్రులకు నోనే ఆర్మీ మెడికల్ యూనిట్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నామని శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో మొత్తం 53 మంది వరకు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్లడించారు.


ఈ ఘటనపై మణిపుర్ సీఎం బిరేన్ సింగ్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 గాలింపు, సహాయక చర్యల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని  వైద్యులతో సహా అంబులెన్సులను ఘటనా స్థలికి చేరుకున్నాయని  సీఎం బిరేన్ సింగ్ తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు