గత్యంతరం లేకే సిఎం రాజ్ భవన్ బాట



గత కొన్ని నెలలుగా రాజ్ భవన్ వైపు కన్నెత్తి కూడ చూసేందుకు ఇష్టపడని ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం రాజ్ భవన్ బాట పట్టక తప్పలేదు.

హైకోర్టు నూత‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉజ్జ‌ల్ భుయాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రోటోకాల్ మేరకు సిఎం తప్పని సరిగా పాల్గొనాల్సి ఉండడంతో గత్యతరంలేక ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక వేళ కెసిఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండ ఉంటే అపవాదు మిగులుతుందని అన్ని ఆలోచించి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు.

 గవర్నర్ తమిళిసై కి సిఎంకు మద్య  చాలా రోజులుగా  మాటలు లేవు.  కెసిఆర్ మనసులో ఎవరిపై అయినా కోపం కలిగితే ఇక వారి ముఖాలు కూడ చూసేందుకు ఇష్టపడరని చెబుతుంటారు. కెసిఆర్ రాజ్ భవన్ వైపు చూడక పోగా గవర్నర్ అసెంబ్లి సమావేశాలకు హాజరుకాకుండానే  సమావేశాలు ముగించారు.

సిఎం కు గవర్నరు కు మద్య తలెత్తిన వివాదాలు ఢిల్లీ వరకు వెళ్లాయి. గవర్నర్ స్వయంగా ప్రధాన మంత్రికి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. మీడియా ముఖంగా రాష్ట్రంలో  నెల కొన్న పరిస్థితులపై విమర్శలు కూడ చేశారు. 

తాజాగా హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా  రాజ్ భవన్ కు వెళ్లక తప్పని  పరిస్థితి కలగడంతో కెసిఆర్ రాజ్ బవన్  లో అడుగు పెట్టారు. గవర్నర్ తమిళి సై తో సిఎం ముభావంగా ఉంటారను కున్నారు కాని అందుకు భిన్నంగా  పుష్పాగుచ్చాలతో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుని సంతోషకరమైన ముఖారవిందాలతో మీడియా కెమెరాల కంటపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర నేతలతో కూడ సిఎం కెసిఆర్ అప్యాయంగా కనిపించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు