దేశ వ్యాప్తంగా ఆందోళన - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మారణ కాండ

 

పోలీసుకాల్పుల్లో ఒకరు మృతి

పలువురికి గాయాలు

మృతుడు వరంగల్ జిల్లా వాసి




అగ్ని పధ్ ఆందోళనలతో దేశం అట్టుడికి పోయింది. బీహార్ సహా పలు రాష్ట్రాలలో విధ్వంసం జరిగింది.తెలంగాణ లో పోలీసుల కాల్పులలో ఒక యులకుడు చనిపోగా మరి కొంత మంది గాయపడ్డారు. ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  లో విధ్వంసం సృష్టించారు. ముందు స్టేషన్ ఎదుట శాంతి యుతంగా నిరసన ప్రసదర్శన జరిపిన యువకులు సుమారు రెండు వేల మంది ఆ తర్వాత కొద్దిసేపటికి రైల్వే స్టేషన్ లోకి చొరపడ్డారు. ప్లాట్ ఫాం పై ఉన్న బుక్ స్టాల్స్, చిరు తిండ్ల షాపులను ధ్వంసం చేసారు. ట్రాక్ పై నిలిచి ఉన్న ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు నిప్పంటించారు. రైల్వే పార్సిల్స్    పడేసి నిప్పంటించారు. పోలీసులు ఆందోళన కారులను నియంత్రించడం సాధ్యం కాలేదు. భాష్ప వాయు గోళాలు ప్రయోగించి ఆ తర్వాత కాల్పుుల జరిపారు. కాల్పుల్ల పలువురు గాయడగా ఉమ్మడి వరంగల్ జిల్లా  ఖానాపూర్ మండలానిక చెందిన ధభీర్ పేట గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు  అక్కడి కక్కడే చనిపోయాడు. 

భద్రతా వైఫల్యం

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన విధ్వంసం భద్రతా చర్యల వైఫల్యంవల్లే జరిగాయి. దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటి బీహార్ లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా సంఘటనలు జరిగినా తెలంగాణ లో సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. ఆర్మి రిక్రూట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్న యువకులు వేలాది మంది రైల్వేస్టేషన్ కు చేరుకుని విధ్వంసం సృష్టించే వరకు నిఘా వర్గాలు ఏం చేశాయో అర్దం కాదు. 

మారణకాండ జరిగి ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగిన తర్వాత రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  అల్లర్ల వెనక రాజకీయ ప్రోద్బలం ఉందని బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

పోలీసుల కవ్వింపు వల్లే రాళ్లు రువ్విన యువకులు

పోలీసులు తమపై కాల్పులకు సిద్దపడడం వల్లే రాళ్లు రువ్వామని ఆందోళన కారులు మీడియాకు తెలిపారు. శాంతి యుతంగా ఆందోళన జరుపుతుంటే పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని దాంతో యువకులు ఏం జరుగుతుందో అ్దం కాక రాళ్లు రువ్వారని  తలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు